‘బఘీర’ సినిమా గురించి ఆశ్చర్య పరిచే విషయాలు షేర్ చేసిన దర్శకుడు డాక్టర్ సూరి

ఉగ్రమ్ ఫేమ్ రోరింగ్ స్టార్ శ్రీమురళి ఎక్సయిటింగ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘బఘీర’తో అలరించబోతున్నారు. ప్రశాంత్ నీల్ ఈ చిత్రానికి కథ అందించారు. డాక్టర్ సూరి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. రుక్మిణి వసంత్, ప్రకాష్ రాజ్ అచ్యుత్ కుమార్, గరుడ రామ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేశాయి. పలు బ్లాక్‌బస్టర్‌లను విజయవంతంగా డిస్ట్రిబ్యూషన్ చేసిన టాలీవుడ్ టాప్ డిస్ట్రిబ్యూషన్ హౌస్ ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎల్‌ఎల్‌పి ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తోంది. దీపావళి కానుకగా అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో బఘీర విడుదల కానుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ డాక్టర్ సూరి విలేకరులు సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు.

 ‘బఘీర’ కి చాలా మంచి హైప్ వుంది.. కాంగ్రాజ్యులేషన్స్?
-థాంక్ యూ

దర్శకుడిగా ఇంతకుముందు చేసిన సినిమాల గురించి ?
-12 ఏళ్ల క్రితం యష్ తో ఒక సినిమా చేశాను. తర్వాత ఆయనతోనే జర్నీ కంటిన్యూ చేశాను. ఆయన కథలని నేనే వినే వాడిని. మా ఇద్దరి కాంబినేషన్ లో మరో సినిమా రావాలి. అయితే కేజీఎఫ్ కి ఎక్కువ సమయం తీసుకోవడంతో అది ఆలస్యమౌతూ వచ్చింది.

‘బఘీర’ కి ప్రశాంత్ నీల్ గారు కథ ఇచ్చారు కదా..ఈ కథలోకి మీరు ఎలా వచ్చారు?
-మురళి గారు సినిమా చేద్దామని అనుకున్నప్పుడు ఆ సమయంలో ఏ కథ కుదరలేదు. అప్పుడు ప్రశాంత్ నీల్ గారు తనదగ్గర వున్న కథ చెప్పారు. అది మాకు చాలా నచ్చింది. అప్పుడు కేజీఎఫ్ జరుగుతోంది. నేను రైటింగ్ టీంలో వున్నాను. అప్పుడు ఆయన చెప్పిన కథ డెవలప్ చేస్తూ వచ్చాను. అలా పూర్తి కథ రెడీ అవ్వడానికి రెండేళ్ళు పట్టింది.

‘బఘీర’ కథ ఎలా వుంటుంది ?
-ఇది ఒక కుర్రాడి లైఫ్ జర్నీ.  ఒక మామూలు కుర్రాడు రియల్ లైఫ్ లో సూపర్ హీరో అవ్వాలనుకుంటే ఎలా ? అతనికి ఏవేవి వచ్చు ? సూపర్ హీరో అవ్వగలిగాడా లేదా ? సొసైటీకి చేయాల్సిన మంచి చేశాడా లేదా ? అనేదే కథ.  

ఇందులో యాక్షన్ తో పాటు ఎమోషన్ ఉంటుందా ?
-ఈ సినిమాలో చాలా ఎమోషనల్ గా వుంటుంది. ప్రతి యాక్షన్ వెనుక ఎమోషన్ వుంటుంది. మంచి ఎమోషనల్ హై ఇచ్చే సినిమా ఇది.

ప్రశాంత్ నీల్ గారు సినిమా చూశారా ?
-చూశారు. చాలా హ్యాపీగా ఫీలయ్యారు. ఆయన హ్యాపీగా ఫీలవ్వడం నాకు వెయ్యి ఏనుగుల బలం ఇచ్చింది.

రుక్మిణి వసంత్, ప్రకాష్ రాజ్ అచ్యుత్ కుమార్, గరుడ రామ్ క్యారెక్టర్స్ ఎలా వుంటాయి?
-ఇందులో ప్రతి క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ వుంటుంది. ప్రతి క్యారెక్టర్ కథలో కీలకం. ట్రైలర్ చూసి ప్రతి క్యారెక్టర్ కి ప్రాముఖ్యత వుంటుంది.

ఇందులో హీరోది సూపర్ హీరో క్యారెక్టరా?
-ఇందులో హీరోది రియల్ లైఫ్ క్యారెక్టరే. సూపర్ మ్యాన్ లాంటి పవర్ ఏమీ వుండవు. రియల్ లైఫ్ లోఎవరైనా సూపర్ హీరో కావచ్చు. అయితే అవ్వాలనుకునే ఉద్దేశం ముఖ్యం. ఇందులో హీరో క్యారెక్టర్ లార్జర్ దెన్ లైఫ్ తరహా తీర్చిదిద్దడం జరిగింది. స్క్రీన్ ప్లే చాలా గ్రిప్పింగ్ గా వుంటుంది.  

ట్రైలర్ లో చూస్తే కేజీఎఫ్ టోన్ కనిపించింది ?
-నైట్ షూట్ ఎక్కువగా వుండటం వలన అలా అనిపించిఉండవచ్చు కానీ ఇది కేజీఎఫ్ టోన్ లో వుండదు. బైర అంటేనే బ్లాక్ పాంథర్. బైర వచ్చేదే నైట్. నైట్ లో యాక్షన్ ఎక్కువగా వుంటుంది. దాని వలన కేజీఎఫ్ లా అనిపిస్తుంది కానీ ఇది కేజీఎఫ్ లా వుండదు.

అజినీస్ లోక్ నాథ్ మ్యూజిక్ గురించి ?
-అజినీస్ ఎక్స్ ట్రార్డినరీ మ్యూజిక్ ఇచ్చాడు. ఇలాంటి మ్యూజిక్ కూడా చేయగలుగుతాడా అని అందరూ సర్ ప్రైజ్ అవుతారు.

మీరు పేరులో వున్న ‘డాక్టర్’ గురించి ?
-నేను డాక్టర్ నే. డెంటిస్ట్ ని. అయితే సినిమా పాషన్ తో ముందు నుంచి సినీ ఫీల్డ్ లోనే వున్నాను.

మీరు చాలా స్వచ్ఛమైన తెలుగు మాట్లాడుతున్నారు?  
-నేను తెలుగువాడినే. మా అమ్మ గారిది చిత్తూరు. అయితే నేను పుట్టి పెరిగింది బెంగళూరు.

తెలుగులో సినిమా చేయాలని ట్రై చేయలేదా?
-లేదండీ. ఈ సినిమా తర్వాత మంచి అవకాశం వస్తే చేస్తాను.

హోంబలే ఫిలింస్ గురించి ?
-విజయ్ కిరగందూర్ నాకు కేజీఎఫ్ నుంచి పరిచయం. చాలా సపోర్ట్ చేశారు. కావాల్సిన ప్రతిది ఎక్కడా రాజీపడకుండా సమకూర్చారు. ఈ సినిమాని మొదటి నుంచే తెలుగు కన్నడలో రిలీజ్ చేయాలని అనుకున్నాం.

మీకు ఎలాంటి సినిమాలు చేయడం ఇష్టం?
-కమర్షియల్ సినిమాలే నాకు నచ్చుతాయి. అందులో ఏ జోనర్ అయినా ఇష్టమే.

ఆల్ ది బెస్ట్
-థాంక్ యూ