దిల్ రాజు కధాచౌర్యం – “బలగం”

కథా చౌర్యం చాలా ఈజీ ఐపోలేదూ… ఎవడో ఒక రచయిత తన జీవితంనుంచో, తన ప్రాంతపు భాషనుంచో ఒక కథ రాసుకుంటాడు. మరో రచయిత(?) దాన్ని కాస్త మార్చి, కొంత చేర్చి సినిమా స్క్రిప్టుగా మార్చేసుకుంటాడు. ఇట్ల ఓ కొత్త సినిమా తీసి… నాలుగు గొప్ప మాటలు చేర్చి ప్రచారం చేసుకుంటారు. ఇప్పుడూ అదే జరిగింది Sathish Gaddam 2014 ప్రాంతంలో “పచ్చికి” అనే కథ రాశాడు. “పిట్టకు వెట్టుడు” అనే సాంప్రదాయాన్ని కలుపుకొని అభివృద్ధి చేసే విధ్వంసాన్ని చెప్పాడు. నమస్తే తెలంగాణా పత్రిక సండే బుక్ లో వచ్చిన ఈ కథ మంచి పేరు తెచ్చుకుంది.


అయితే…. ఇప్పుడు ఆ కథ అతి చిన్న మార్పులతో #బలగం అనే స్క్రిప్టుగా మారింది. రచయిత పేరులో మాత్రం పెద్ద మార్పే జరిగింది. సతీష్ గడ్డం పేరు పోయింది. కథలో తెలంగాణా యాసలో ఉండే ఒరిజినాలిటీ పోయింది. సినిమా మాత్రం బయటికి వచ్చింది…. ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు ఇప్పటికీ అసలు రచయితని మాత్రం… కనీసం ఒక మాట కూడా అడగకుండానే సినిమా పూర్తి చేసి వదిలారు.