సూపర్ స్టార్ మహేష్ బాబు స్టన్నింగ్ న్యూ లుక్

సూపర్ స్టార్ మహేష్ బాబు దేశంలోనే మోస్ట్ డిజైరబుల్ మ్యాన్. మహేష్ బాబు తన ఫిట్‌నెస్‌తో చాలాసార్లు ఆశ్చర్యపరిచారు. మహేష్ బాబు ఫిట్‌నెస్ ఫ్రీక్ అని చాలా మందికి తెలియదు. పర్ఫెక్ట్ ఫిజిక్ ని మెంటైన్ చేయడానికి రెగ్యులర్ గా జిమ్ చేస్తారు. మహేష్ తన బాడీని చక్కటి టోన్ తో ఉంచుతారు. నిరంతరం శరీరంపై శ్రద్ధ చూపిస్తారు. మహేష్ డెడికేషన్ ఇతరులకు స్ఫూర్తిని ఇవ్వడంలో సహాయపడుతుంది.

మహేష్ బాబు స్టన్నింగ్ న్యూ లుక్ తో అభిమానులని అలరించారు. గ్రీక్ గాడ్ లా కనిపిస్తున్న ఈ ఫోటో సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరిని మస్మరైజ్ చేస్తోంది.

వెస్ట్, షార్ట్స్ ధరించి తన బైసప్స్ చూపించారు. జిమ్ వర్క్ ఔట్స్ కారణంగా మహేష్ చార్మ్ ని కోల్పోలేదు. నిజానికి, మహేష్ గతంలో కంటే మరింత ఆకర్షణీయంగా కనిపిస్తున్నారు.

మహేష్ బాబు ప్రస్తుతం SSMB28 లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు.