`మ‌హ‌ర్షి` మేజిక్ చేస్తుందని న‌మ్మ‌కంతో చెప్తున్నా! – దిల్‌రాజు

dil raju

మ‌హేష్‌బాబు హీరోగా న‌టించిన సినిమా `మ‌హ‌ర్షి`. వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌కుడు. అశ్వ‌నీద‌త్‌, దిల్‌రాజు, పీవీపీ నిర్మాత‌లు. ఈ సినిమా గురువారం విడుద‌ల కానుంది. ఈ సంద‌ర్భంగా దిల్‌రాజు హైద‌రాబాద్‌లో మాట్లాడారు. ఆయ‌న చెప్పిన విష‌యాలు…

మ‌హేష్ కెరీర్‌లో ల్యాండ్ మార్క్ సినిమా, ఆయ‌న 25వ సినిమాను మ‌రి కొన్ని గంట‌ల్లోనే ప్రేక్ష‌కులు ప్ర‌పంచ‌వ్యాప్తంగా చూడ‌బోతున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నేను చెప్పిన‌ట్టు, మ‌హేష్‌గారి కెరీర్‌లో కొన్ని టాప్ సినిమాలున్నాయి. అలాగే ఈ మ‌హ‌ర్షి కూడా ఆ టాప్ సినిమాల ప‌క్క‌న నిల‌బ‌డబోతోంది. ఫ్యాన్స్ కు కూడా `ఈ సినిమా ఎంత స‌క్సెస్ కావాల‌ని ఆశ‌ప‌డుతున్నారో, అంతా కోరుకోండి` అని ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చెప్పాను. అది ఓవ‌ర్ కాన్ఫిడెన్స్ తో నేను చెప్పింది కాదు. ఈ సినిమాతో నా ట్రావెల్‌, ఈ క‌థ విన్న‌ప్ప‌టినుంచీ నా మ‌న‌సులోని భావాలు, అప్ప‌టికే సినిమా పూర్తిగా చూడ‌టం… ఇవ‌న్నీ క‌ల‌గ‌లిసి నేను చెప్పాను. కొన్ని సినిమాలు ఎట్టి ప‌రిస్థితుల్లో త‌ప్పు చేయ‌వు. అలాంటిది ఓ స్టార్ హీరో సినిమాకు కావాల్సిన గ్రేట్ మూమెంట్స్ ఇందులో ఉన్నాయి. ఏదో సినిమా తీశాం.. బావుంది అన్న‌ట్టు కాకుండా, ఈ సినిమాలో చాలా చాలా ప్ర‌త్యేక‌త‌లున్నాయి. గురువారం దాన్ని అందరూ ఎక్స్ పీరియ‌న్స్ చేస్తారు. కొన్నిసార్లు కొన్ని సినిమాలు చూసిన‌ప్పుడు `వావ్‌..ఎంత మంచి సినిమా చేశారు. ఎంత బాగా చేశారు` అని అనిపిస్తుంది. `మ‌హ‌ర్షి` నా సినిమా కాక‌పోయినా నేను అలాగే ఫీల‌య్యేవాడిని. మా సంస్థ ఈ సినిమాతో అసోసియేట్‌ కాక‌పోయినా కూడా నేను అలాగే ఫీల‌య్యేవాడిని. ఇంక కొన్ని గంట‌ల్లోనే ఇది గ్రేట్ సినిమా అని అంద‌రూ అంగీక‌రిస్తారు. అశ్వ‌నీద‌త్‌గారి పేరు కూడా ఈ సినిమాతో అసోసియేట్ అయి ఉంది. మే 9న ఆయ‌న సంస్థ‌లో `జ‌గ‌దేక‌వీరుడు అతిలోక సుంద‌రి`, `మ‌హాన‌టి` విడుద‌ల‌య్యాయి. ఆయ‌న‌కు ఆ డేట్ మ్యాజిక్ ఉంది. అలాగే పీవీపీగారు కూడా ప్యాష‌న్‌తో ఈ సినిమాతో అసోసియేట్ అయ్యారు. మ‌హేష్ 25వ సినిమాకు మూడు బ్యాన‌ర్లు అసోసియేట్ కావ‌డం గ్రేట్ ఎక్స్ పీరియ‌న్స్. వంశీ ఈ సినిమాతో టాప్ డైర‌క్ట‌ర్ల‌లో ఒక డైర‌క్ట‌ర్ అవుతాడు. దేవీ సంగీతం, మోహ‌న‌న్ కెమెరా, ఈ క‌థ‌ను రాసుకోవ‌డంలో వంశీతో ట్రావెల్ అయిన హ‌రి, సాల‌మ‌న్‌, ఎడిట‌ర్లు, ఆర్టిస్టులు న‌రేష్‌గారు, ప్ర‌కాష్‌రాజ్‌గారు, జ‌య‌సుధ‌గారు, జ‌గ‌ప‌తిబాబుగారు, పూజాహెగ్డే.. ఇలా అంద‌రూ త‌మ‌త‌మ పాత్ర‌ల్లో ఒదిగిపోయారు. మ్యాజిక్ క్రియేట్ చేసే సినిమా ఇది. ఈ మాట ఓవ‌ర్ కాన్ఫిడెన్స్ తో అంటున్న మాట‌ కాదు. నా న‌మ్మ‌కం అది. నేను ఆడుతాయి అని ప‌ది సినిమాల‌ను అంటే, వాటిలో ఒక్క‌టి మిస్ అయి ఉంటుందేమోగానీ, తొమ్మిది సినిమాలు మాత్రం మిస్ కాలేదు.అంత కాన్పిడెన్స్ ఉంది నాకు.

భారీ బ‌డ్జెట్‌తో చేసిన సినిమా కావ‌డం వ‌ల్ల హ్యూజ్ రిలీజ్ చేస్తున్నాం.

తెలంగాణ ప్ర‌భుత్వాన్ని కూడా ఐదో షో కోసం అడిగాం. వాళ్లు కూడా అంగీక‌రించి, నిన్న ఐదో షో కోసం అనుమతి ఇచ్చారు.

ఆ జీఓ వ‌ల్ల హైద‌రాబాద్‌లో 15-18 థియేట‌ర్ల‌లో 8 గంట‌ల షోలు ప‌డ‌తాయి. అలాగే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్ట‌ర్స్ లో, మ‌రో 30-35 సెంట‌ర్ల‌లో 8 గంట‌ల‌కే సినిమా మొద‌ల‌వుతుంది. మామూలుగా తెలంగాణలో 8 గంట‌ల షోల ట్రెండ్ లేదు. ఆంధ్రాలో తెల్లారుజామున 5 గంట‌ల‌కే షోలు స్టార్ట్ అవుతాయి. మేం ప‌ర్మిష‌న్లు ఇస్తే వాళ్లు అర్ధ‌రాత్రి 1 గంట‌కు కూడా మొద‌లుపెడ‌తారు.

నిన్న తెలంగాణ‌లో జీఓ వ‌చ్చాక మిస్ క‌మ్యూనికేష‌న్ జ‌రిగింది. మ‌రీ ముఖ్యంగా అడ్మిష‌న్ రేట్ల గురించి. ఈ అడ్మిష‌న్ రేట్లు అనేవి తెలంగాణ ప్ర‌భుత్వం కాకుండా, థియేట‌ర్ల ఓన‌ర్లే కోర్టు ద్వారా కొన్ని కొన్ని రేట్ల‌ను థియేట‌ర్ల‌లో పెంచారు. అలాగే ఆంధ్రాలోనూ పెరిగాయి. ఇక్క‌డ 80 ఉన్న ద‌గ్గ‌ర 100 రూపాయ‌లు చేశారు. 100 ఉన్న ద‌గ్గ‌ర 125 చేశారు. అలాగే మ‌ల్టీప్లెక్స్ ల వారు 150 ఉన్న చోట 200 చేశారు. అవ‌న్నీ కోర్టు ద్వారా తెచ్చుకున్న‌వి. అలాగే రాజ‌మండ్రిలో సింగిల్ స్క్రీన్ల‌లో 200 ఉంది. విజ‌య‌వాడ‌, గుంటూరు, నెల్లూరు,వైజాగ్, క‌ర్పూలు… ఇలా అక్క‌డ 200 ఉంది. అక్క‌డ అల‌వాటు ఉంది. తెలంగాణ‌లో సింగిల్ స్క్రీన్‌లు అత్య‌ధికంగా 125 ఉన్నాయి. అలాగే మ‌ల్టీప్లెక్స్ ల‌లో బెంగుళూరులో వీకెండ్‌లో 300-500 ఇచ్చేంత ప్రొవిజ‌న్ ఉంది. కానీ తెలంగాణ‌లో అది లేదు. తెలుగు స్టేట్స్ లో లిమిటేష‌న్ ఉంది. సో.. ఇలాంటి పెద్ద సినిమాలు వ‌చ్చిన‌ప్పుడు, పెద్ద బ‌డ్జెట్‌లు వ‌చ్చిన‌ప్పుడు సినిమాకు రెవెన్యూ జ‌న‌రేట్ చేయ‌డానికి ఉన్న స్కోప్‌లో ఎగ్జిబిట‌ర్స్ ద్వారా, ఇది ఎప్ప‌టి నుంచో జ‌రుగుతోంది. కోర్టు ద్వారా కొన్ని కొన్ని రేట్లు ఇంక్రీస్ అయ్యాయి.

కొన్ని మీడియాల్లో తెలంగాణ రేట్లు హైక్ చేసింద‌ని రాంగ్ న్యూస్ రాశారు. టిక్కెట్ రేట్లు కోర్టు ద్వారా వ‌చ్చింది. ఐదో షో ప‌ర్మిష‌న్ మాత్రం తెలంగాణ ప్ర‌భుత్వం ఇచ్చింది. ఈ హైక్ ఒక వారం మాత్రం ఉంటుంది.

ఒక‌ప్పుడు స‌క్సెస్‌ఫుల్ సినిమా జ‌ర్నీకి జూబ్లీ వేడుక‌లు జ‌రిగాయి. ఆ త‌ర్వాత అవి 100 రోజుల‌య్యాయి. ఇప్పుడు `బాహుబ‌లి` లాంటి సినిమాకు కూడా 50 రోజులే అవుతున్నాయి. అందువ‌ల్ల ఒక గ్రేట్ సినిమా వ‌చ్చినా రెవెన్యూ అనేది మేజ‌ర్ గా తొలి నాలుగు రోజులే ఉంటుంది. హాలీవుడ్‌, బాలీవుడ్‌గానీ, మ‌న ద‌గ్గ‌ర‌గానీ, ఎక్క‌డైనా ట్రెండ్ మారింది. ఆ వీకెండ్స్ ఉన్న రెవెన్యూ మెయిన్‌గా సాగుతోంది. ఇప్పుడు అంద‌రూ ఫాస్ట్ ఫుడ్ డేస్‌లో ఉంటున్నారు. సినిమాను ఫాస్ట్ గా చూడాల‌నేది ఒక‌టి, రెండోది పైర‌సీ వ‌ల్ల డ్యామేజ్ ఎక్కువ‌గా జ‌రుగుతుంది. ఎంత కంట్రోల్ చేసినా, ఏం చేసినా పైర‌సీ వ‌స్తూనే ఉంది. అలాంట‌ప్పుడు పెద్ద సినిమాలు టార్గెట్ రీచ్ కావాలంటే టికెట్ హైక్స్ త‌ప్ప‌వు.

సినిమా ప్ర‌పంచ‌వ్యాప్తంగా 2000 స్క్రీన్‌లున్నాయి. ఆన్‌లైన్ బుకింగ్‌లో ఎక్స్ ట్రార్డిన‌రీ పుల్లింగ్ ఉంది కాబ‌ట్టి, ఇప్ప‌టికిప్పుడైనా ఒక థియేట‌ర్ ఫుల్ అయితే, ప‌క్క థియేట‌ర్ వాళ్ల‌ను అడిగినా వాళ్లు కూడా సినిమా వేస్తారు.

`బాహుబ‌లి` త‌ర్వాత హ‌య్య‌స్ట్ థియేట‌ర్ల‌లో విడుద‌ల‌వుతున్న సినిమా ఇది. రెవెన్యూ ఎంత వ‌స్తుంద‌నేది రేప‌టిదాకా ఆగి చూడాల్సిందే.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో సంక్రాంతికి సినిమాలు విడుద‌లైన‌ప్పుడు రేట్ల‌ను పెంచుకోవ‌చ్చు. కానీ తెలంగాణ‌లో అది ఇది వ‌ర‌కు లేదు. ప‌క్క రాష్ట్రాల వారితో కంపేర్ చేసిన‌ప్పుడు ఇక్క‌డ అట్లీస్ట్ పెర‌గాలి క‌దా అని థియేట‌ర్ల వాళ్లు వెళ్లి తెచ్చుకున్నారు. ఇది ఇండివిజువ‌ల్‌గా తెచ్చుకున్న‌దే. గ్రూప్‌గా వెళ్లి తెచ్చుకున్న‌ది కాదు.

నేను పెట్టింది, నాకు వ‌చ్చింది … ఇలాంటి ఫ్యాక్ట్స్ ఎవ‌రికి తెలుసు? ఎవ‌రికీ తెలియ‌కుండా, ఎవ‌రికి కావాల్సిన‌వి వాళ్లు రాసుకుంటూ ఉన్నారు. నిజానిజాలు ఏంట‌న్న‌ది నాకు తెలుసు. నా పార్ట్ న‌ర్ల‌కు తెలుసు. ఈ సినిమా బ‌డ్జెట్ ఎంత అనేదాని మీద చాలా విష‌యాలు ఉంటాయి. నేను సినిమాకు ఎంత ఖ‌ర్చుపెట్టాను? ఎక్స్ ట్రా అంశాల‌కు ఎంత ఖ‌ర్చ‌యింది? అనేది మాకు తెలుసు. అవ‌న్నీ ప్రాజెక్ట్ మీద‌కు తీసుకోలేం. కొన్ని లాంగ్ ప్రాజెక్టుల‌కు డ్యామేజ్‌లు ప‌డ‌తాయి. ఇంట్ర‌స్టులు కావ‌చ్చు, అనుకోని అంశాలు కావ‌చ్చు… వాట‌న్నిటిని బ‌డ్జెట్‌లోకి తీసుకోలేం. ఇది ఆల్మోస్ట్ 18 నెల‌ల ప్రాజెక్ట్. ఇందులో అందరికీ జీతాల నుంచి ప్ర‌తిదీ పెరిగిన‌ట్టే క‌దా. మామూలుగా పెద్ద సినిమాల‌ను 7-8 నెల‌ల్లో పూర్తి చేస్తాం. కానీ ఈ సినిమా మీద 10 నెల‌ల బ‌రువు ఉంది. 10 నెల‌ల శాల‌రీల నుంచి అన్నిటినీ క‌లుపుకోవాలి. ఇవ‌న్నీ ఫిగ‌ర్ల‌లో క‌నిపిస్తాయి కానీ, ఆ సినిమాలో క‌నిపించ‌వు. అవ‌న్నీ లాజిస్టిక్స్. ట్రావెల్‌లో త‌ప్ప ఇవ‌న్నీ చెప్పేవి కావు.