తమిళ హీరో ధనుష్, దర్శకుడు వెట్రిమారన్ కలియికలో వచ్చిన లేటెస్ట్ సినిమా అసురన్. దసరా కానుకగా విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. అన్ని సెంటర్స్ లో పాజిటివ్ టాక్ తెచ్చుకున్న అసురన్ సినిమా ఫస్ట్ వీక్ లోనే 30కోట్ల గ్రాస్ ని రాబట్టింది. ధనుష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచేలా ఉన్న అసురన్ చెన్నై లో 3.30కోట్లు రాబట్టింది. ఫస్ట్ వీక్ ఎండ్ కే చాలా ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ చేరిన అసురన్, ఫుల్ రన్ లో అసురన్ బయ్యర్లకు భారీగా లాభాలను తీసుకొచ్చేలా కనిపిస్తోంది.
విలేజ్ బ్యాక్ డ్రాప్ లో శివసామిగా ధనుష్ నటించాడు. ఇద్దరి పిల్లల తండ్రిగా అద్భుతమైన నటన చూపించిన ధనుష్ పక్కన మలయాళ నటి మంజు వారియర్ హీరోయిన్ గా కనిపించింది. కలైపులి ఎస్ థాను నిర్మించిన అసురన్, ధనుష్ వెట్రిమారన్ కాంబినేషన్ లో వచ్చిన సినిమాల్లో బెస్ట్ మూవీగా కాంప్లిమెంట్స్ అందుకుంటుంది. అయితే ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం అసురన్ సినిమాలో వయలెన్స్ ఎక్కువగా ఉందని అంటున్నారు.