ప్రభాస్ రికార్డ్స్ లేపడం ‘వార్’ చేసినంత అంత వీజీ కాదు

బాలీవుడ్ హంక్స్ హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ కలిసి నటించిన సినిమా వార్. గాంధీ జయంతి నాడు ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ సినిమా ట్రేడ్ వర్గాలకి కూడా చుక్కలు చూపిస్తోంది. మూడు రోజుల్లో వంద కోట్లు, అయిదు రోజుల్లో 150 కోట్లు రాబట్టిన వార్ సినిమా ఇండియన్ మిషన్ ఇంపాజిబుల్ రేంజులో అలరిస్తుంది. ముఖ్యంగా హృతిక్ రోషన్ కి హ్యూజ్ అప్రిసియేషన్ వస్తోంది. మూడు వందల కోట్ల బెంచ్ మార్క్ ని టార్గెట్ చేస్తున్న వార్ సినిమా ఇప్పటి వరకూ అంటే రిలీజ్ అయిన తొమ్మిది రోజుల్లో 238.35 కోట్లు రాబట్టింది. వార్ ఇదే జోష్ కొనసాగిస్తే, సెకండ్ వీక్ ఎండ్ లోపే 300 కోట్ల మార్క్ దాటుతుంది అనడంలో సందేహం లేదు.

war bahubali

ఇదిలా ఉంటే వార్ సినిమా కేవలం 2019కే బిగ్గెస్ట్ హిట్ కాకుండా, 2016 నుంచి ఇప్పటి వరకూ రిలీజ్ అయిన అన్ని సినిమాల్లో 9 రోజుల్లో హైయెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా చరిత్రకెక్కింది. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా ప్రకటించిన తరన్ ఆదర్శ్… సుల్తాన్, టైగర్ జిందా హై, సంజు రికార్డులని వార్ సినిమా బ్రేక్ చేసిందని పోస్ట్ చేశారు. ఈ లిస్ట్ లో వార్ సినిమాకన్నా ముందు ఉన్నది మన బాహుబలి మాత్రమే. బాహుబలి సినిమా 247 కోట్లు రాబట్టింది, అది కూడా 7 రోజుల్లోనే కావడం విశేషం. మన సినిమా రిలీజ్ అయ్యి రెండేళ్లు దాటినా బాలీవుడ్ మేకర్స్ ఆ రికార్డుని టచ్ చేయలేకపోతున్నారు. వార్ సినిమా 9 రోజుల్లో 238 కోట్లు రాబట్టినా బాహుబలి సినిమాకి 9కోట్ల దూరంలో ఆగిపోయింది.