కంగనాపై పరువు నష్టం దావా కేసు

వివాదాల్లో ఉండటం బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్‌కి బాగా ఇష్టం. కావాలని ఆమె ఎప్పుడూ ఏదోక వివాదంలో వార్తల్లో నలుగుతూనే ఉంది. వివాదాలకు ఆమె కేరాఫ్ అడ్రస్ అని చెప్పవచ్చు. తాజాగా మరోసారి కంగనా రనౌత్ తీరు వివాదాస్పందంగా మారింది. కంగనాపై ప్రముఖ గేయ రచయిత జావేద్ అక్తర్ పరువు నష్టం దావా కేసులు వేశాడు. ఈ దావాకు సంబంధించి తాజాగా ఆయన కోర్టుకు హాజరై తన వాదనలు వినిపించారు. ఫిర్యాదుదారుడి వాదనలు విన్న కోర్టు.. తదుపరి విచారణను డిసెంబర్ 19కి వాయిదా వేసింది.

KANGANA RANOUT

తమ పరువుకు భంగం కలిగించేలా కంగనా మీడియా ఛానెళ్లలో వ్యాఖ్యలు చేసిందని కంగనాపై జావేద్ అక్తర్ పరువు నష్టం దావా దాఖలు చేశాడు. మీడియా చానెళ్ల చర్చలో తన పేరును సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ ఆత్మహత్య కేసులో ప్రస్తావించిందని జావేద్ అక్తర్ తెలిపాడు. సుశాంత్ కేసులోకి తన పేరును అన్యాయంగా లాగిందని, ఆమె చేసిన వ్యాఖ్యలు తన పరువును దెబ్బతీసేలా ఉన్నాయన్నాడు.

కాగా ఈ ఏడాది జూన్ 14న సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా ఇది సంచలనంగా మారగా.. వివాదాలు కూడా చెలరేగాయి. బాలీవుడ్‌లో కొంతమంది బడా వ్యక్తుల వల్ల సుశాంత్‌కు సినిమా అవకాశాలు రాలేదని, అందుకే మనస్థాపంతో ఆత్మహత్య చేసుకున్నాడనే విమర్శలు కూడా వచ్చాయి. సుశాంత్ ఆత్మహత్య కేసులపై ప్రభుత్వం సీబీఐ విచారణకు కూడా ఆదేశించింది. ప్రస్తుతం దీనిపై సీబీఐ విచారణ చేపడుతోంది.