బాలీవుడ్లో టాప్ హీరోయిన్గా కొనసాగుతున్న దీపికా పదుకొణెకు పెళ్లైన తర్వాత అవకాశాలు మరింతగా పెరిగిపోయాయి. పెళ్లైన తర్వాత మాములుగా హీరోయిన్లకు అవకాశాలు తగ్గుతాయి. కానీ దీపికాకు మాత్రం అవకాశాలు మరింతగా పెరగడం విశేషం. బాలీవుడ్లో ఇప్పటికీ అత్యధిక రెమ్యూనరేషన్ అందుకుంటున్న హీరోయిన్ కూడా దీపికానే. హీరోయిన్లు అనగానే… బ్రాండెడ్ వస్తువులు వాడుతూ ఉంటారు. వాటి ధర లక్షల్లోనే ఉంటుంది.
హీరోయిన్ల దుస్తులు, హ్యాండ్ బ్యాగ్ ధరల గురించి సోషల్ మీడియాలో ఎప్పుడూ చర్చ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు దీపికా పదుకొణే హ్యాండ్ బ్యాగ్ ధర గురించి ఒక వార్త హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా న్యూ ఇయర్ సందర్భంగా భర్త రణ్వీర్ సింగ్‌తో కలిసి రాజస్థాన్‌లోని రణతంబోర్కి దీపికా వెళ్లింది. అప్పుడు దీపికా చేతిలోని హ్యాండ్ బ్యాగ్ చాలా ఎట్రాక్టివ్‌గా ఉంది.
దీని విలువ 3 లక్షల ఉంటుందట. ఈ బ్యాగ్ లోపలి పాకెట్స్‌లో మాగ్నెటిక్ లాక్ ఉంటుంది. ఇది బొట్టెగా వెనెటా చైన్ క్యాసెట్ కంపెనీకి చెందినది. దీని ధర తెలుసుకుని ఇప్పుడు ఫ్యాన్స్ షాక్‌కు గురవుతున్నాయి. ఆమె బ్యాగ్ ధరతో ఒక చిన్నపాటి కారు కొనుక్కోవచ్చని నెటిజన్లు చెబుతున్నారు.