రవితేజ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ రికార్డు

రవితేజ హీరోగా గోపిచంద్ మలినేని తెరకెక్కించిన ‘క్రాక్’ ట్రైలర్ న్యూ ఇయర్ సందర్భంగా నిన్న విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇందులో రవితేజ డైలాగులు అసలు మాములుగా లేవు. ట్రైలర్‌లోని పవర్‌ఫుల్ డైలాగులు రవితేజ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. దీంతో ఈ సినిమా కోసం మాస్ మహారాజా అభిమానులు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.

RAVITEJA KRACK RECORD VIEWS
RAVITEJA KRACK RECORD VIEWS

అయితే విడుదలకు ముందే క్రాక్ రికార్డులు సృష్టిస్తోంది. నిన్న విడుదలైన ట్రైలర్ భారీ వ్యూస్‌ను సంపాదించుకుంటోంది. కేవలం 20 గంటల్లోనే ఈ ట్రైలర్ 6.2 మిలియన్ల వ్యూస్ సాధించింది. అంతేకాకుండా రెండు లక్షలకుపైగా లైక్స్ సాధించింది. రవితేజ సినిమా కెరీర్‌లోనే ఇప్పటివరకు ఏ ట్రైలర్‌కు ఇంత భారీ వ్యూస్, లైక్స్ రాలేదు. ప్రస్తుతం యూట్యూబ్ ట్రెండింగ్‌లో నెంబర్ వన్ స్థానంలో ఇది కొనసాగుతోంది.

ఈ సినిమాలో పోలీస్ పాత్రలో రవితేజ నటించగా.. శృతిహాసన్ హీరోయిన్‌గా కనిపించనుంది. తమన్ మ్యూజిక్ అందించగా.. వరలక్ష్మీ శరత్ కుమార్, రవిశంకర్ కీలక పాత్రలలో నటించారు.