ఒక్క పాటతో సోషల్ మీడియాని షేక్ చేస్తున్న రజినీకాంత్

సూపర్‌స్టార్ రజనీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ దర్బార్‌. ఎ.ఆర్‌.మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్నఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. తమిళ్ లో చుమ్మా కిల్లి అంటూ సాగిన ఈ సాంగ్ ని తెలుగులో దుమ్ము ధూళి.. అంటూ రిలీజ్ చేశారు. అనిరుద్ మ్యూజిక్, ఎవర్ గ్రీన్ ఎస్పీబి వాయిస్ కలిసి ఈ సాంగ్ ని టాప్ ట్రెండింగ్ లోకి తెచ్చాయి. 24 గంటలు తిరిగే సరికి తెలుగు, తమిళ వెర్షన్స్ కి కలిపి 10 మిలియన్ వ్యూస్ రాబట్టిన ఈ లిరికల్ సాంగ్ కొత్త రికార్డు క్రియేట్ చేసింది. మాస్‌ను, తలైవా ఫ్యాన్స్ ను మెప్పించేలా ఉన్న ఈ సాంగ్ దర్బార్ సినిమా ప్రొమోషన్స్ కి కావాల్సినంత కిక్ ఇచ్చింది. సంక్రాంతిని టార్గెట్ చేస్తూ రానున్న దర్బార్ నుంచి రానున్న రోజుల్లో మరిన్ని సాంగ్స్ అండ్ టీజర్, ట్రైలర్ ని చూడబోతున్నాం. అవి బయటకి వచ్చే లోపు ఈ సూపర్ సాంగ్ విని ఎంజాయ్ చేయండి.