సూప‌ర్‌స్టార్ ర‌జనీకాంత్‌కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు.. టీఎఫ్‌పీసీ బెస్ట్ విషెస్‌!

కోలీవుడ్ సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ గారికి సినీ రంగంలో అత్యున్న‌త పుర‌స్కారం అయిన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ల‌భించింది. ఈ విష‌యాన్ని కేంద్ర‌మంత్రి ప్ర‌కాశ్ జ‌వ‌డేక‌ర్ తాజాగా ప్ర‌క‌టించారు. 51వ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ర‌జ‌నీ అందుకోనున్న‌ట్టు మంత్రి తెలిపారు. ఈ అవార్డు అందుకున్న 50వ వ్య‌క్తి బాలీవుడ్ లెజండ‌రీ అమితాబ్ బ‌చ్చ‌న్ కాగా.. బిగ్‌బి అంటే ర‌జ‌నీకి అమిత‌మైన ప్రేమాభిమానం ఉంటుంది..అయితే బిగ్‌బి త‌ర్వాత 51వ వ్య‌క్తిగా ఈ అవార్డు ఆయ‌న‌ అందుకోవ‌డం విశేషం. ఈ సంద‌ర్భంగా ర‌జ‌నీ గురించి కొన్ని ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను తెలుసుకుందాం..

Rajanikanth

వెండితెర‌పై ర‌జ‌నీ క‌న‌బ‌డితే చాలు అభిమానుల‌కు పెద్ద పండుగ‌గాభావిస్తారు.. ఆయ‌న అసలు పేరు శివాజీ గైక్వాడ్ మ‌హరాష్ట్రలో జ‌న్మించారు. ఐదేళ్ల వ‌యసులోనే త‌ల్లి ప్రేమ‌ను కోల్పోయారు. చిన్న‌త‌నం నుంచే ఆడ‌పాద‌డ‌పా నాట‌కాలు వేసిన ఆయ‌న ఎన్నో క‌ష్టాలను చ‌విచూశాడు.. ఒక‌వైపు కండ‌క్ట‌ర్‌గా ఉద్యోగం చేస్తూ.. మ‌రోవైపు నాట‌కాలను వేసేవారు.. వేసిన ప్ర‌తీ నాట‌కంలో ఓ ప్రత్యేక శైలి ఉండేది.. అదే ఆయ‌న జీవితాన్ని మ‌లుపు తిప్పింది.. ఓ సారీ నాట‌కంలో దుర్యోధ‌నుడి పాత్ర‌లో ర‌జ‌నీని చూసిన త‌న స్నేహితుడు ఆ న‌ట‌న‌ను చూసి మంత్ర ముగ్ధుడై డ‌బ్బులిచ్చి మ‌రీ ర‌జ‌నీని మ‌ద్రాసు పంపాడని.. మ‌ద్రాసు చేరుకున్న త‌ర్వాత న‌ట‌న‌లో శిక్ష‌ణ తీసుకున్నాన‌ని ఓ సంద‌ర్భంలో తెలిపాడు ర‌జ‌నీ. ఏవీఎం, జెమిని, విజ‌య‌వాహిని ఏ స్టూడియోకు వెళ్లిన అవ‌కాశాలు రాలేదు.. దీంతో బ‌తుకే వేస్ట్ అనుకుని తిరిగి వెళ్లిపోయిన ఆయ‌నకు త‌న స్నేహితులు ధైర్యం చెప్పి మ‌ళ్లీ మ‌ద్రాసు వెళ్లి సినీ ప్ర‌యాత్నాల‌ను కొన‌సాగిస్తున్న క్ర‌మంలో ప్ర‌ముఖ ద‌ర్శకుడు కె.బాల‌చంద‌ర్ ఆయ‌న‌కు అవ‌కాశాన్ని ఇచ్చారు.. ర‌జీకాంత్ అనే పేరును బాల‌చంద‌ర్ గారే పెట్టారు.. ర‌జ‌నీకాంత్ అనే పేరుతో తొలి చిత్రం త‌మిళ్ అపూర్వ రాగంగ‌ళ్‌, రెండోది క‌న్న‌డ సంగ‌మ‌, మూడోది తెలుగులో అంతులేని క‌థ‌.. ఇలా తొలి మూడు చిత్రాలు మూడు బాష‌ల్లో న‌టించిన ఆయ‌న. త‌న మేన‌రిజం, స్టైల్‌, డైలాగ్ డెలివ‌రీతో వ‌రుస చిత్రాల‌ను చేస్తూ సినీ ఇండ‌స్ట్రీలో సూప‌ర్‌స్టార్‌గా ఎంతో గుర్తింపు సంపాదించుకున్నాడు. తెలుగులో నంద‌మూరి తార‌క రామారావుగారు అంటే ర‌జనీకి ఎంతో అభిమానం.. ఒక‌నొక సంద‌ర్భంలో ర‌జ‌నీకాంత్ చెబుతూ.. తాను ఇష్ట‌ప‌డే దైవం రాఘ‌వేంద్ర‌స్వామికి, ఎన్టీఆర్‌గారికి మాత్ర‌మే కాళ్ల‌కు దండం పెడ‌తాన‌ని ఆయ‌న తెలిపారు. ఇక‌ మ‌హ‌రాష్ట్రలో పుట్టి బెంగళూర్‌లో పెరిగి న‌ట‌న‌పై ఆస‌క్తి ఉండ‌డంతో మ‌ద్రాస్‌లో ఓ ఇనిస్టిట్యూట్‌లో శిక్ష‌ణ తీసుకున్న‌ అనంత‌రం త‌మిళ్, తెలుగు, క‌న్న‌డ‌, హిందీ ప‌లు భాష‌ల్లో నటించి ఇండియాతో పాటు చైనా, జ‌పాన్‌, మ‌లేషియా ఇలా ప్ర‌పంచ‌వ్యాప్తంగా సూప‌ర్‌స్టార్‌గా ఎంతో గుర్తింపు తెచ్చుకున్నాడు ర‌జ‌నీ.. అలాంటి వ్య‌క్తికి అత్యున్న‌త పుర‌స్కారంగా భావించే దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు రావ‌డం సంద‌ర్భంగా టీఎఫ్‌పీసీ త‌ర‌పున‌, టీఎఫ్‌పీసీ కార్య‌ద‌ర్శులు మోహ‌న్ వ‌డ్ల‌ప‌ట్ల గారు, తుమ్మ‌ల ప్ర‌స‌న్నకుమార్‌గారు బెస్ట్ విషెస్ తెలిపారు.