
చిత్త పరిశ్రమలు గత కొన్ని రోజులగా వినిపిస్తున్న ప్రశ్న పాటలపై హక్కు ఎవరికీ అని. సంగీత దర్శకుడు ఇళయరాజా తన పాట పై తనదే హక్కు అంటూ ఉంటారు. కొంతమంది గాయనీ గాయకుడు ఆ హక్కు మాదే అంటుంటారు. అయితే చెన్నైకి చెందిన ఇంటర్నేషనల్ ట్రేడ్ మార్క్ అసోసియేషన్ సహకారంతో క్రియాలా, ఐపి అండ్ మ్యూజిక్ సంస్థలు కలిసి చెన్నైలో ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ మీటింగ్లో ముఖ్యంగా నిర్మాత ధనుంజయన్, థింక్ మ్యూజిక్ ఇండియా సంతోష్, గాయకుడు హరిచరణ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అయితే పాటలపై ఎవరికి హక్కు ఉంటుందని అనే ప్రశ్నపై వారు ఈ విధంగా వివరించారు. ఒక పాట రూపుదిద్దుకుని బయటకు రావడానికి పాటను రాసిన గీత రచయిత, పాడిన గాయకుడు, సంగీతం అందించిన సంగీత దర్శకుడు, అలాగే సౌండ్ ఇంజనీర్ తదితరులు అంతా కలిసి ఎంతో కృషి చేస్తే కానీ ఒక పాట రూపొందదు అని అన్నారు. అయితే దీని అంతటికీ ముఖ్య కారణం నిర్మాత. నిర్మాత పెట్టుబడి పెట్టకపోతే అటువంటి ఒక పాట బయటకు రాదని అన్నారు. కాబట్టి నిర్మాత ప్రధాన హక్కుదారుడు. ఒకవేళ ఈ విషయంపై ఏదైనా అగ్రిమెంట్ ఉంటే సరే, షరతుల ప్రకారం అగ్రిమెంట్లో ఉన్నవారికి హక్కు ఉంటుంది. లేకపోతే కచ్చితంగా పాటపై హక్కు నిర్మాతకే ఉంటుందని వివరించారు. అంతేకాక నిర్మాత చనిపోయిన తర్వాత ఆ హక్కు వారి కుటుంబానికి వెళ్తుందని అన్నారు.