మోహన్ బాబు ఆరోగ్య పరిస్థితిపై క్లారిటీ ఇచ్చిన కాంటినెంటల్ హాస్పిటల్స్

గత నాలుగు రోజులుగా మంచు కుటుంబ వ్యవహారాలు చూస్తూనే ఉన్నాము. ఇది ఇలా ఉండగా నిన్న సాయంత్రం జరిగిన ఘర్షణలో మోహన్ బాబు ఆరోగ్యపరమైన ఇబ్బందులు పడటం జరిగింది. వెంటనే ఆయనను కాంటినెంటల్ హాస్పిటల్ కు చేర్చగా మోహన్ బాబు ఆరోగ్య పరిస్థితి గురించి కాంటినెంటల్ హాస్పిటల్స్ సిబ్బంది స్పందించడం జరిగింది. డాక్టర్ గురునాథ్ రెడ్డి ద్వారా మోహన్ బాబు మెడలో కాలులో నొప్పి ఉండగా బీపీతో మానసికంగా బాధపడుతున్నారని, రాత్రి అంతా ఆయన నిద్ర లేక బాధపడుతున్నారని తెలిపారు. మోహన్ బాబు ఎడమ కంటి కింద కమిలిపోయిందని, ఫేస్ సిటీ స్కాన్ చేస్తామని వెల్లడించారు. ప్రస్తుతానికి ఇన్ఫ్టేషన్ రూమ్ లో ఉండగా ప్రస్తుతం మోహన్ బాబు హైబీపీతో ఇబ్బంది పడుతున్నారని, బీపీ ఫ్లక్చుయేట్ అవుతూ ఉండటంతో అన్ని రకాల టెస్టులు నిర్వహిస్తున్నట్లు హాస్పిటల్స్ సిబ్బంది తెలిపారు.