- అల్లు అర్జున్ మాట ఇచ్చినట్లుగా ఆ కుటుంబానికి, బాలుడికి అండగా నిలబడ్డారు. ఇప్పటి వరకు ఆ బాలుడి పూర్తి హాస్పిటల్ ఖర్చు సుమారు 15-20 లక్షలు మొత్తం అల్లు అర్జున్ భరించడం జరిగింది.
- బాలుడు ఆరోగ్య నిమిత్తం అవసరమైన అన్ని అత్యవసర వైద్య సదుపాయాలు సింగపూర్ నుంచి తెప్పించడం జరిగింది.
- ఒక వేళ అల్లు అర్జున్ పబ్లిసిటీ కోసమే ఇది అంత చేసే వ్యక్తి అయితే ఇప్పటికే ఆ బాలుడితో ఒక ఫోటో పెట్టడం, లేదా ఆ కుటుంబంతో ఒక ఫోటో పెట్టడం, ఆ కుటుంబంతో ఒక వీడియో చేయడం లాంటివి చేసే వారు. కాని అల్లు అర్జున్ అలా చేయలేదు. అల్లు అర్జున్ పబ్లిసిటీ కోరుకునే వ్యక్తి కాదు. అందుకే చేయాల్సిన సాయం అంతా సైలెంట్ గా చేసుకుంటూ వెళ్లిపోయారు.
- బాలుడు తండ్రి కేసు వెనక్కి తీసుకుంటాను అన్నప్పుడే అర్థమై ఉంటుంది, అల్లు అర్జున్ ఎంత సిన్సియర్ గా వారి విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు అనేది.
- సినీ పరిశ్రమలోని వారంతా అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి కలిసింది అల్లు అర్జున్ పై జాలితో కాదు, అల్లు అర్జున్ కేరక్టర్ పై గౌరవంతో, ఆయన ఆలోచన, ఆచరణ పై ఉన్న నమ్మకం తో వెళ్లి కలిశారు. అల్లు అర్జున్ కు తాము అండగా ఉంటామని తెలియచేస్తూ, అల్లు అర్జున్ తత్త్వాన్ని నమ్మి వెళ్లిన వారు.