సంక్రాంతికి విడుదల కానున్న సినిమాలు ఇవే

లాక్‌డౌన్ వల్ల షూటింగ్‌లు ఆగిపోవడం, థియేటర్లు మూతపడటంతో ఇండస్ట్రీ మొత్తం స్తంభించిపోయింది. షూటింగ్‌లు ఆగిపోవడంతో సెలబ్రెటీలు ఇంటికే పరిమితమయ్యారు. ఇక థియేటర్లకు కూడా మూతపడటంతో నిర్మాతలు సినిమాలు విడుదల చేయలేని పరిస్థితి. దీంతో చాలా సినిమాలు ఓటీటీలలో విడుదలయ్యాయి. చాలామంది పెద్ద హీరోల సినిమాలను కూడా ఓటీటీలలో విడుదల చేశారు. ఇటు కరోనా సమయంలో ప్రేక్షకులు కూడా ఓటీటీలలో సినిమా చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు.

vakeelsab

అయితే ప్రస్తుతం కరోనా ప్రభావం తగ్గిపోయిన క్రమంలో థియేటర్లను ఓపెన్ చేసుకునేందుకు తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు అనుమతి ఇచ్చాయి. దీంతో క్రిస్మస్ నుంచి సినిమాలను థియేటర్లలో విడుదల చేసేందుకు మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నారు. సాయి థరమ్ తేజ్ హీరోగా నటించిన ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమా క్రిస్మస్ కానుకగా థియేటర్లలో విడుదల కానుంది. ఇక జనవరిలో సంక్రాంతి సందర్భంగా చాలామంది పెద్ద హీరోల సినిమాలు బాక్సాఫీస్ ముందుకు రానున్నాయి.

పవన్ హీరోగా వస్తున్న వకీల్ సాబ్ సంక్రాంతికి రానుంది. ఇక రామ్ హీరోగా తెరకెక్కిన రెడ్ సినిమా కూడా సంక్రాంతికి థియేటర్లలో విడుదల కానుంది. ఇక కేజీఎఫ్-2, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, క్రాక్ సినిమాలు సంక్రాంతికి రానున్నాయి. వీటితోు పాటు గోపీచంద్ హీరోగా రానున్న సిటీమార్ కూడా సంక్రాంతికి రానుంది.