మరో జాతీయ పార్టీలోకి బండ్ల గణేష్

టాలీవుడ్ బడా నిర్మాత బండ్ల గణేష్ గత ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ కోసం తాను ప్రాణమైనా ఇష్టానని, ఎన్నికల్లో కాంగ్రెస్ తప్పకుండా గెలుస్తుందని జోస్యం చెప్పాడు. కాంగ్రెస్ గెలవకపోతే బ్లేడుతో గొంతు కోసుకుంటానంటూ ఇంటర్వ్యూల్లో అదరగొట్టాడు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేయాలని బండ్ల గణేష్ ఎన్నో ప్రయత్నాలు చేశాడు. అయితే టీడీపీ-కాంగ్రెస్ పొత్తులో భాగంగా బండ్ల గణేష్‌కు టికెట్ దక్కలేదు. పొత్తులో భాగంగా బండ్ల గణేష్ పోటీ చేయాలనుకున్న నియోజకవర్గ టికెట్ టీడీపీ అభ్యర్థికి దక్కింది.

bandla ganesh

ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోవడంతో రాజకీయాలకు స్వస్తి చెప్పిన బండ్ల గణేష్. తనకు రాజకీయాలు సెట్ కావని చెప్పాడు. ప్రస్తుతం పవన్ కల్యాణ్‌తో మరో సినిమా చేసిన నిర్మాతగా కమ్ బ్యాక్ ఇవ్వాలని బండ్ల గణేష్ చూస్తున్నాడు. పవన్ తనతో సినిమా చేసేందుకు ఒప్పుకున్నాడని ఇటీవల ట్విట్టర్‌లో బండ్ల గణేష్ ట్వీట్ కూడా పెట్టాడు.

అయితే మళ్లీ రాజకీయాల్లోకి వచ్చేందుకు బండ్ల గణేష్ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలో అతడు బీజేపీలో చేరనున్నాడనే ప్రచారం జరుగుతోంది. బీజేపీకి మద్దతు ఇస్తున్నట్లు పవన్ ఇప్పటికే ప్రకటించిన క్రమంలో.. బీజేపీలో చేరితే బాగుంటుందని బండ్ల గణేష్ భావిస్తున్నాడట. ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ ఎన్నికలు జరుగుతున్న క్రమంలో బీజేపీలో చేరడానికి ఇదే సరైన సమయమని బండ్ల గణేష్ అనుకుంటున్నాడట.