మొత్తానికి కరోనా వైరస్ కోవిడ్ -19 లాక్ డౌన్ నాలుగో దశ సడలింపులు కూడా త్వరలో ముగుస్తున్నాయి. దీంతో అక్టోబర్ 15వ తేదీ నుంచి అన్ లాక్ 5.0 పూర్తిగా ప్రారంభమవుతుంది. పాఠశాలలను తిరిగి తెరవడంపై, అక్టోబర్ 15 తర్వాత రాష్ట్రాలు నిర్ణయం తీసుకోవడానికి అనుమతించబడ్డాయి. ‘రీ-ఓపెనింగ్’ కోసం భారత ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను జారీ చేయనుంది. సినిమా హాళ్ళు, మల్టీప్లెక్సులు వంటి వాటిని అక్టోబర్ 15 నుండి తిరిగి తెరవడానికి అనుమతులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
ఇక స్విమ్మింగ్ ఫూల్స్ అదే రోజు క్రీడాకారులు కోసం తిరిగి ప్రారంభం కానున్నట్లు సమాచారం. సినిమా థియేటర్ల కోసం అలాగే అన్ని రకాల మల్టీప్లెక్సులలో సీటింగ్ సామర్థ్యంలో 50% వరకు తెరవడానికి అనుమతించబడతాయి, దీని కోసం, SOPను I & B మంత్రిత్వ శాఖ జారీ చేయనుంది. అన్ లాక్ 5.0 మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం ఇంకా జారీ చేయాల్సి ఉంది. అయితే, ఈ కాలంలో దాదాపు మరిన్ని సడలింపులను కేంద్రం ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.