చియాన్ విక్రమ్ ‘వీర ధీర శూరన్ పార్ట్ 2’ టీజర్ విడుదల

టాలెంటెడ్ యాక్టర్, స్టార్ హీరో చియాన్ విక్రమ్ ‘వీర ధీర శూరన్ పార్ట్ 2’ భారీ అంచనాల నడుమ తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి  ఎస్ యు అరుణ్‌కుమార్ దర్శకత్వం వహించారు. ఆర్ఆర్ఆర్,విక్రమ్‌ చిత్రాలను డిస్ట్రిబ్యూట్ చేసి, ముబైకార్, థగ్స్, మురా వంటి చిత్రాలను హెచ్ఆర్ పిక్చర్స్ బ్యానర్ మీద రియా శిబు నిర్మించి మంచి సక్సెస్ అందుకున్నారు. ప్రస్తుతం ఈయన నిర్మాతగా ‘వీర ధీర శూరన్ పార్ట్ 2’ రాబోతోంది. ఈ క్రమంలో తాజాగా టీజర్‌ను విడుదల చేశారు.

కిరాణ కొట్టులో హీరో ఉండటం.. సరుకుల కోసం మహిళ రావడం.. తన కూతురికి డిస్టర్బ్ అవుతుంది మెల్లిగా అడుగు అంటూ హీరో అనడం.. జాలీగా తన ఫ్యామిలీతో కలిసి తిరుగుతున్న హీరో ఆ తరువాత వెంటనే గన్‌తో విధ్వంసం సృష్టించడం..  అలా విక్రమ్ పాత్రలోని రెండు కోణాల్ని టీజర్‌లో చూపించాడు. ఇక పోలీస్ ఆఫీసర్‌గా ఎస్ జే సూర్య ఈ చిత్రంలో చాలా కొత్తగా కనిపించబోతోన్నారు. ఈ టీజర్‌లో ఈ సినిమాలో విక్రమ్, ఎస్ జే సూర్య, సూరజ్ వెంజరమూడు, దుషార విజయన్‌లు బాగా హైలెట్ అయ్యారు.

ఇప్పటికే ‘వీర ధీర శూరన్ పార్ట్ 2’ చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం చిత్ర బృందం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌లో బిజీగా ఉంది. ఈ మూవీ నుంచి ఇది వరకు రిలీజ్ చేసిన గ్లింప్స్ యూట్యూబ్‌లో ఇప్పటికే 14 మిలియన్ల వ్యూస్‌ను కొల్లగొట్టి అందరినీ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా రిలీజ్ చేసిన టీజర్‌లో చియాన్ విక్రమ్ నటన, యాక్షన్ సీక్వెన్సులు, విజువల్స్, ఆర్ఆర్ వర్క్ ఇలా అన్నీ కూడా అభిమానుల అంచనాలను మించిపోయాయి. ఇక ఇందులో చియాన్ విక్రమ్ డిఫరెంట్ లుక్స్, ఎస్ జే సూర్య పర్ఫామెన్స్, పాత్రలకు ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ దక్కేలా ఉంది.

ఈ టీజర్‌తో సినిమా మీద అంచనాలు రెట్టింపు అయ్యాయి. తేని ఈశ్వర్  సినిమాటోగ్రఫీ,  జి.వి.ప్రకాష్ కుమార్ సంగీతం, జి.కె.ప్రసన్న ఎడిటింగ్, సి.ఎస్.బాలచందర్ ఆర్ట్ డైరెక్షన్‌ బాధ్యతల్ని నిర్వర్తించారు. ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరిలోన తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో భారీ ఎత్తున రిలీజ్ కానుంది.

నటీనటులు :  విక్రమ్, ఎస్ జే సూర్య, సూరజ్ వెంజరమూడు, దుషార విజయన్‌ తదితరులు

సాంకేతిక బృందం
బ్యానర్ : హెచ్ఆర్ పిక్చర్స్
నిర్మాత : రియా శిబు
దర్శకుడు : ఎస్ యు అరుణ్‌కుమార్
ఎడిటర్ : జి.కె.ప్రసన్న
సంగీతం : జి.వి.ప్రకాష్ కుమార్
కెమెరామెన్ : తేని ఈశ్వర్
ఆర్ట్ డైరెక్టర్ : సి.ఎస్.బాలచందర్
పీఆర్వో : నాయుడు సురేంద్ర కుమార్ – ఫణి కందుకూరి (బియాండ్ మీడియా)