మెగాస్టార్ అభిమానులకు పండగే

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఆచార్య సినిమా షూటింగ్ ఇటీవలే తిరిగి ప్రారంభమైన విషయం తెలిసిందే. సినిమాలోని పలువురు నటుడపై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. అయితే త్వరలో మెగాస్టార్ చిరంజీవి, మెగా వపర్ స్టార్ రాంచరణ్ ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొననున్నారు. వచ్చే నెల 9వ తేదీ నుంచి ఆచార్య షూటింగ్‌లో చిరంజీవి, రాంచరణ్ పాల్గొననున్నారని సమాచారం.

chiranjevi

ప్రస్తుతం హైదరాబాద్‌లోని కోకాపేటలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సెట్‌లో ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సినిమా కోసం కాలనీ సెట్ ఏర్పాటు చేశారు. ఈ సెట్‌లో చిరుపై కీలక ఘట్టాల్ని తెరకెక్కించనున్నారు. చిరుతో పాటు రాంచరణ్ కూడా ఈ షూటింగ్‌లో పాల్గొననున్నాడు. వచ్చే సమ్మర్‌లో ఈ సినిమాను విడదల చేసేందుకు మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నారు.

మ్యాట్నీ మూవీస్ బ్యానర్‌పై రాంచరణ్‌తో కలిసి నిరంజన్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కాజల్ అగర్వాల్ ఈ సినిమాలో చిరు పక్కన హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే రాంచరణ్ పక్కన హీరోయిన్‌గా ఎవరు నటిస్తారనేది ఇంకా కన్ఫార్మ్ కాలేదు. త్వరలోనే రాంచరణ్ సరసన హీరోయిన్‌ను ఎంపిక చేయున్నారు.