ముగ్గురు భామలతో రాఘవేంద్రరావు

టాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ రాఘవేంద్రరావు కెమెరా ముందుగా రానున్నాడు. ఇప్పటివరకు కెమెరా వెనుక ఉండి సినిమా తీసిన ఆయన.. ఇప్పుడు కెమెరా ముందుకు వచ్చి యాక్టింగ్ చేయనున్నాడు. జనార్థన్ మహర్షి డైరెక్షన్‌లో రానున్న సినిమాలతో రాఘవేంద్రరావు కీలక పాత్రలో నటించనున్నారని సమాచారం. ఇందుల సమంత, శ్రియ, రమ్యకృష్ణతో పాటు మరోకరు కీలక పాత్రలో నటించనున్నారట.

raghavendrarao

దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో రానుందని సమాచారం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన తుదిదశ చర్చలు కూడా జరుగుతున్నాయి. ఇందులో ఫుల్ లెంగ్త్ పాత్రలో రాఘవేంద్రరావు నటించనున్నారట. డైరెక్టర్‌గా సక్సెస్ అయిన రాఘవేంద్రరావు.. ఇప్పుడు యాక్టింగ్‌తో కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవాలని భావిస్తున్నారట.

అలాగే వెబ్‌సిరీస్‌ల వైపు కూడా రాఘవేంద్రరావు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. మరి ఇందులో రాఘవేంద్రరావు నటన ఎలా ఉంటుందనే దాని కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.