బిగ్‌బాస్-4 ఫైనల్‌కు గెస్ట్‌లు ఎవరో తెలుసా?

తెలుగు బిగ్‌బాస్-4 క్లైమాక్స్‌కు చేరుకుంది. ఆదివారంతో సీజన్‌ 4కు ఎండ్ కార్డు పడనుంది. ఆదివారం జరగనున్న గ్రాండ్ ఫినాలేకు గెస్ట్‌లుగా ఎవరు వస్తారనే దానిపై అనేక వార్తలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ఫినాలేను గ్రాండ్‌గా జరపాలని నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగా పెద్ద పెద్ద సెలబ్రెటీలను గెస్ట్‌లుగా పిలుస్తున్నారు. అంతేకాకుండా హీరోయిన్లతో డ్యాన్స్ ఫర్‌ఫామెన్స్‌లు ఇప్పించాలని అనుకుంటున్నారు.

BIGBOSS4

తాజా సమాచారం ప్రకారం.. మెగాస్టార్ చిరంజీవి గ్రాండ్ ఫినాలేకు గెస్ట్‌గా రానున్నారని సమాచారం. బిగ్‌బాస్ టైటిల్ గెలిచిన వారికి చిరంజీవి మెడల్‌తో పాటు రూ.50 లక్షల ప్రైజ్‌మనీ అందజేయనున్నారు. గత సీజన్‌కు కూడా చిరంజీవినే గెస్ట్ వచ్చి టైటిల్ విన్నర్‌కు మెడల్, ప్రైజ్‌మనీ అందించారు. ఇప్పుడు ఈ సీజన్‌కు కూడా చిరంజీవినే రానున్నట్లు సమాచారం. ఇక చిరంజీవితో పాటు మరో గెస్ట్ కూడా రానున్నారని తెలుస్తోంది.

చిరుతో పాటు నాగార్జున పెద్ద కుమారుడు నాగచైతన్య గెస్ట్‌గా రానున్నాడట. ప్రస్తుతం శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో ‘లవ్ స్టోరీ’ అనే సినిమాలో నాగచైతన్య నటిస్తున్నాడు. ఇందులో సాయిపల్లవి హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాను త్వరలో విడుదల చేసేందుకు నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం నాగచైతన్య బిగ్‌బాస్ షోకు గెస్ట్‌గా వస్తున్నట్లు సమాచారం. చైతన్యతో పాటు సాయిపల్లవి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయట.