నటి ప్రాణం తీసిన ప్లాస్టిక్ సర్జరీ

హీరోలు, హీరోయిన్లకు అందం అనేది చాలా ముఖ్యం. అందంగా, స్ట్రైలిష్‌గా ఉంటేనే వాళ్లను చూసేందుకు ప్రేక్షకులు ఇష్టపడతారు. అందంగా ఉంటేనే వారికి సినిమా అవకాశాలు వస్తాయి. దీంతో చాలామంది హీరోలు, హీరోయిన్లు అందం కోసం ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుంటూ ఉంటారు. కానీ ప్లాస్టిక్ సర్జరీల వల్ల అనేక సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఆరోగ్యంపై ఇది చాలా ప్రతికూల ప్రభావం చూపుతోంది. ఇలా ప్లాస్టిక్ సర్జరీలు వికటించి చాలామంది సెలబ్రెటీలు ప్రాణాలు పొగోట్టుకున్నారు.

PLASTIC SURGERY

హీరోయిన్ అర్తి అగర్వాల్ లైఫో సక్సెమీ ఫెయిల్యూర్‌తోనే మరణించినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా నటి జోస్లిన్ కానో ఆపరేషన్ వికటించడంతో మరణించింది. ఇటీవల ఈమె కొలంబియాలో ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంది. శరీరంలోని ఒకచోటి కొవ్వును వేరొక చొటికి మార్చే ఆపరేషన్ చేశారు. ఇది వికటించడంతోనే ఈమె మరణించినట్లు చెబుతున్నారు.

జోస్లిన్ ఇన్‌స్టాగ్రామ్‌లో 12.9 మిలియన్ల మంది ఫాలోవర్లను కలిగి ఉంది. మొదట ఈమె ఈత దుస్తుల డిజైనర్. ఆ తర్వాత టాప్ మోడల్‌గా ఎదిగింది. దీని తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి నటిగాను మంచి పేరు సంపాదించుకుంది.