ఎట్టకేలకు రుహాణి శర్మ తెలుగులో ‘హిట్’ సినిమా చేస్తోంది

రుహాణి శర్మ… ‘చి ల సౌ’ సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న రుహాణి, మిడిల్ క్లాస్ అమ్మాయి పాత్రలో అందరినీ బాగా మెప్పించింది. ఈ ఒక్క సినిమాతోనే టాలీవుడ్ కి మంచి హీరోయిన్ దొరికింది అనే కాంప్లిమెంట్స్ అందుకున్న రుహాణి శర్మకి, తెలుగులో వరసగా ఆఫర్స్ వస్తాయనుకున్నారు కానీ చి లా సౌ సినిమా విడుదలై ఎనిమిది నెలలవుతున్నా కూడా ఆమె నుంచి రెండో సినిమా రాలేదు.

ఇలాంటి సమయంలో ఇంస్టాగ్రామ్ లో, ట్విట్టర్ లో హాట్ ఫోజులతో ఫోటోలు పెడుతూ అభిమానులకి స్పెషల్ ట్రీట్ ఇస్తూనే, ఫైట్లు చేస్తున్న వీడియోలు కూడా పోస్ట్ చేసింది. ఈ ఫైట్స్ చూశారో లేక చి లా సౌ సినిమాలో యాక్టింగ్ చూశారో తెలియదు కానీ ఎట్టకేలకు రుహాణికి తెలుగులో నటించే అవకాశం వచ్చింది. నాని ప్రొడ్యూస్ చేయనున్న ఈ సినిమాలో విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్నాడు. ఈరోజే లాంచ్ అయిన ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలయ్యింది. హిట్ తో పాటు రుహాణి దిల్ రాజు బ్యానర్ లో నూటొక్క జిల్లాల అందగాడు సినిమా చేస్తోంది. మరి ఈ రెండు సినిమల్లోా రుహాణి కెరీర్ ని టర్న్ చేసే మూవీ ఏదో చూడాలి.