కంప్లీట్ యాక్షన్ థ్రిల్లర్ గా కమాండో 3… ఆకట్టుకుంటున్న ట్రైలర్

విధ్యుత్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా కమాండో 3. కమాండో సినిమాకి రెండో సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఒక మిషన్ పై లండన్ వెళ్లిన ఇండియన్ టీం దాన్ని ఎలా కంప్లీట్ చేసింది అనే కథతో ఈ సినిమా రానుంది. దాదాపు ప్రతి సినిమాలో కథ ఇలానే ఉన్నా కూడా, కమాండో 3 మాత్రం బాగా గ్రాండ్ స్కేల్ లో తెరకెక్కించారు. భావన రెడ్డిగా అదా శర్మ, మరో హీరోయిన్ గా కనిపించిన అంగిరా అదిరిపోయే స్టంట్స్ చేశారు. కరణ్ సింగ్ గా కనిపించిన విధ్యుత్ జంవాల్ సూపర్బ్ యాక్షన్ ఎపిసోడ్స్ తో మరోసారి మెప్పించాడు. ఇంటర్నేషనల్ సినిమా చుస్తున్నామా అనే ఫీలింగ్ ట్రైలర్ తోనే కలిగించిన చిత్ర యూనిట్, కమాండో 3 సినిమాని నవంబర్‌ 29న ఈ సినిమా విడుదల చేయనున్నారు.