మానవ స్పర్శను అనుభవించలేని అరుదైన వ్యాధితో బాధపడుతున్న అఘోరా పాత్రలో మాస్ కా దాస్ విశ్వక్ సేన్‌ని ప్రజెంట్ చేయాలనే బేసిక్ ఐడియా అప్ కమింగ్ మూవీ ‘గామి’ పై క్యురియాసిటీని పెంచింది. విద్యాధర్ కాగిత దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రన్ని కార్తీక్ కల్ట్ క్రియేషన్స్‌పై కార్తీక్ శబరీష్ నిర్మించారు, ఈ అడ్వెంచర్ డ్రామాకి క్రౌడ్ ఫండ్ చేశారు. వి సెల్యులాయిడ్ సమర్పిస్తోంది.
ఫస్ట్ లుక్, మేకింగ్ వీడియో ఇతర ప్రమోషనల్ కంటెంట్ ఆసక్తిని రేకెత్తించాయి. తాజాగా ‘గామి’ ప్రధాన పాత్రలను పరిచయం చేయడానికి ఒక చిన్న టీజర్‌తో ముందుకు వచ్చారు. విశ్వక్ సేన్ తన సమస్యకు నివారణను చెప్పే వాయిస్ ఓవర్‌తో వీడియో ప్రారంభమవుతుంది. ఎంజీ అభినయ, చాందిని చౌదరి, ఇతర ముఖ్యమైన పాత్రలు ఒకదాని తర్వాత మరొకటి పరిచయం చేయబడ్డాయి. చివరగా, విశ్వక్ శంకర్ అనే అఘోరాగా పరిచయం అయ్యారు. “ఇవన్నీ దాటుకొని నా వల్ల అవుతుందంటారా ?” అని విశ్వక్ చెప్పడం ఆసక్తిగా వుంది. చివరి విజువల్స్‌లో విశ్వక్, చాందిని హిమాలయ పర్వతాలను ట్రెక్కింగ్ చేస్తున్నట్లు చూపించారు. గామి టీజర్‌లోని పాత్రలు చాలా ఎక్సయిటింగ్ గా వున్నాయి. టీజర్ ద్వారా అనౌన్స్ చేసినట్లు ఫిబ్రవరి 29న థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు.
హారిక పెడాడ, మహ్మద్ సమద్ ముఖ్య తారాగణం. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ విశ్వనాథ్ రెడ్డి, రాంపీ నందిగాం అందిస్తున్నారు. నరేష్ కుమారన్ మ్యూజిక్. విద్యాధర్ కాగిత, ప్రత్యూష్ వత్యం స్క్రీన్ ప్లే సమకూరుస్తున్నారు.
గామి మార్చి 8న ప్రేక్షకుల ముందుకు రానుంది.
తారాగణం:- విశ్వక్ సేన్, చాందిని చౌదరి, ఎంజీ అభినయ, హారిక పెడదా, మహ్మద్ సమద్
సాంకేతిక విభాగం:-
దర్శకత్వం:- విద్యాధర్ కాగిత
నిర్మాత:- కార్తీక్ శబరీష్
సమర్పణ:- వి సెల్యులాయిడ్
స్క్రీన్ ప్లే:- విద్యాధర్ కాగిత, ప్రత్యూష్ వత్యం
ప్రొడక్షన్ డిజైన్:- ప్రవల్య దుడ్డుపూడి
ఎడిటర్:- రాఘవేంద్ర తిరున్
సంగీతం:- నరేష్ కుమారన్
డీవోపీ:- విశ్వనాథ్ రెడ్డి
కో-డిఓపి:- రాంపీ నందిగాం
Vfx సూపర్వైజర్:- సునీల్ రాజు చింత
కాస్ట్యూమ్ డిజైన్:- అనూష పుంజాల, రేఖ బొగ్గరపు
కలరిస్ట్:- విష్ణు వర్ధన్ కె
సౌండ్ డిజైన్: – సింక్ సినిమాస్
యాక్షన్ కొరియోగ్రాఫర్:- వింగ్ చున్ అంజి
పాటలు:- నరేష్ కుమారన్, స్వీకర్ అగస్తి
సాహిత్యం:- సనాపతి భరద్వాజ పాత్రుడు, శ్రీ మణి
మార్కెటింగ్:- ఫస్ట్ షో