వీరికి కరోనా వ్యాక్సిన్ ఇవ్వరు.. మార్గదర్శకాలు జారీ చేసిన కేంద్రం

ఇవాళ కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ ప్రక్రియకు సంబంధించి కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర ఆరోగ్యశాఖ అదనపు కార్యదర్శి మనోహర్ లేఖ రాశారు. 18 ఏళ్లు, ఆ పైబడిన వారికి మాత్రమే వ్యాక్సిన్ ఇవ్వాలంది.

CORONA VACCINE GUIDLINES

మొదటగా ప్రభుత్వ, ప్రైవేట్ వైద్యులకు టీకాయి వేయాలని కేంద్రం ఆదేశించింది. ఒక వ్యక్తికి కొవాగ్జిన్, కొవిషీల్డ్ వ్యాక్సిన్లలో ఏదో ఒకటే ఇవ్వాలని, ఏ వ్యాక్సిన్‌ను మొదటి డోసుగా తీసుకుంటారో, రెండో డోసుగా కూడా అదే వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్రం స్పష్టం చేసింది. గర్భిణీలు, పాలిచ్చే తల్లులకు టీకా ఇవ్వకూడదని, వీరిపై ఇప్పటి వరకు టీకా ప్రయోగాలు చేయలేదంది. ఇప్పటికే కరోనా వస్తే.. ఆ వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాతే టీకాలు వేస్తారంది.