స‌లార్ నిరాశ‌ప‌ర‌చ‌దు.. ప్ర‌భాస్‌కు ధ‌న్య‌వాదాలు: ప‌్ర‌శాంత్ నీల్‌‌

టాలీవుడ్ స్టార్ హీరో ప్ర‌భాస్ ప్ర‌స్తుతం వరుస సినిమాల‌తో బిజీ బిజీగా ఉన్నాడు. బాహుబ‌లి చిత్రం త‌ర్వాత ప్ర‌భాస్ పాన్ ఇండియా స్టార్‌గా పేరు తెచ్చుకున్న విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం ఆయ‌న న‌టిస్తున్న రాధేశ్యామ్ చిత్రం షూటింగ్ తుది ద‌శ‌కు చేరుకుంది. అలాగే బాలీవుడ్ ద‌ర్శ‌కుడు ఓంరౌత్ డైరెక్ష‌న్‌లో ఆదిపురుష్ సినిమా త్వ‌ర‌లోనే సెట్స్ పైకి వెళ్ల‌నుంది. ఈ సినిమా షూటింగ్‌ జ‌న‌వ‌రి 19వ తేదీ నుంచి మొద‌లు కానున్న‌ట్లు చిత్ర‌బృందం ప్ర‌క‌టించిన విష‌యం విధిత‌మే.

prabhas saalar

అయితే.. కేజీఎఫ్ ఫేం ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో స‌లార్ చిత్రంలో ప్ర‌భాస్ హీరోగా తెర‌కెక్కుతుండ‌గా.. ఈ సినిమా ముహూర్తం శుక్ర‌వారం హైద‌రాబాద్‌లో నిర్వ‌హించారు. ఈ కార్యాక్ర‌మంలో హీరో య‌శ్‌, క‌ర్నాట‌క డిప్యూటీ సీఎం అశ్వ‌త్థ నారాయ‌ణ్, నిర్మాత దిల్ రాజు, డీవీవీ దాన‌య్య లు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్‌నీల్ మాట్లాడుతూ.. ఈ అవ‌కాశం ఇచ్చిన ప్ర‌భాస్‌కు, నిర్మాత విజ‌య్ కిర‌గందూర్‌కి ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాల‌ని, స‌లార్ నిరాశ‌ప‌ర‌చ‌దు అని ప్ర‌శాంత్‌నీల్ అన్నారు. ఇక పాన్ ఇండియా సినిమా రూపొంద‌నున్న ఈ సినిమాకు హోంబ‌లే ఫిలింస్ బ్యాన‌ర్‌పై విజ‌య్ కిరంగ‌దూర్ నిర్మిస్తున్నారు.