తమిళనాడు ముఖ్యమంత్రిగా జోసెఫ్ విజయ్ పదవీ బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. ఆ క్షణం నుంచి కోలీవుడ్ ప్రముఖులంతా ఒక్కొక్కరిగా వెళ్లి ముఖ్యమంత్రి విజయ్‌ని మర్యాదపూర్వకంగా కలుస్తూనే ఉన్నారు. తాజాగా విశాల్ తన...
రాష్ట్రంలో చలనచిత్ర పరిశ్రమ సమగ్రాభివృద్ధికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించే దిశగా ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ నూతన పాలకవర్గం తొలి బోర్డు సమావేశం సోమవారం విజయవాడ ఫార్చూన్ మురళి పార్క్ హోటల్‌లో విజయవంతంగా...
‘ఓ.. పిట్టకథ’, ‘అన్నపూర్ణ ఫోటో స్టూడియో’, ‘రేపు ఉదయం పది గంటలకు’ వంటి చిత్రాలతో దర్శకుడిగా చెందు ముద్దు సంపాదించుకున్న క్రేజ్, మంచి పేరు గురించి అందరికీ తెలిసిందే. ఆయన దర్శకత్వంలో రానున్న...
విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్‌తో కలిసి ఫాతిమా విజయ్ ఆంటోనీ సమర్పణలో సర్వంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్‌పై రామంజనేయులు జవ్వాజీ నిర్మించిన చిత్రం ‘వంద దేవుళ్ళు’. ఈ మూవీలో విజయ్ ఆంటోని, స్వాసిక,...
సంగీత సంచలనం..రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. ఆయన తన సొంత ఇండిపెండెంట్ లేబుల్ అల్బుకర్కీ రికార్డ్స్‌తో పాటు యూనివర్సల్ మ్యూజిక్ ఇండియాతో కలిసి చేసిన ‘అరవింద్’ పాటను రిలీజ్ చేశారు. ఈ కాంబోలో రిలీజైన తొలి పాట ఇది. తెలుగు, తమిళ భాషల్లో ఒరిజినల్ పాప్, హిప్ హాప్ ఆధారంగా రూపొందిన ఈ ట్రాక్‌తో అనిరుద్ తన సంగీత ప్రపంచంలోని పరిధిని దాటి కొత్త ఆధ్యాయాన్ని ప్రారంభించారు.
2012లో విడుదలైన వైరల్ హిట్ ‘వై దిస్ కొలవెరి డి’ ద్వారా అనిరుద్ దేశవ్యాప్తంగా పాపులారిటీ పొందిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత దక్షిణాదిన జైలర్, కూలీ, విక్రమ్, లియో, దేవర పార్ట్ వన్ వంటి పలు బ్లాక్‌బస్టర్ చిత్రాలకు సంగీతాన్ని అందించారు. అలాగే 2025లో షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి కూడా సంగీత దర్శకుడిగా అక్కడ కూడా బ్లాక్ బస్టర్ అందుకున్నారు.
అనిరుద్..చాలా ఏళ్ల కష్టంతో చిన్న స్థాయి నుంచి అసాధారణ స్థాయికి ఎదిగి అభిమానులతో పాటు సినీ ఇండస్ట్రీ నుంచి కూడా రాక్‌స్టార్ అనే బిరుదుని సంపాదించుకున్నారు. ఇక అరవింద్ పాట విషయానికి వస్తే.. వేగంగా మారుతోన్న డిజిటల్ సంగీత ప్రపంచంలో తన ప్రతిభను నిరూపించుకోవటానికి ఓ ఇండిపెండెంట్ ఆర్టిస్ట్ పడే కష్టాలను ప్రధానంగా ఆవిష్కరించారు అనిరుద్.
ఈ పాట కథలో కేంద్రంగా నిలిచే పాత్ర పేరు అరవింద్. అనిరుధ్‌కి ప్రతిబింబంలాంటి పాత్ర ఇది. ఈగో, ఎన్నో ఇబ్బందులు, సవాళ్లు ఎదురైనా, సంగీతంపై ఉన్న ప్యాషన్‌తో తన జీవితాన్ని పూర్తిగా దానికి అంకితం చేసిన యువ సంగీతకారుడే అరవింద్. ఇప్పటి డిజిటల్ యుగంలో పాటలను విడుదల చేయటం చాలా సులభం. అయితే దక్షిణ భారత సినీ రంగంలో ఇండిపెండెంట్ ఆర్టిస్ట్‌గా ప్రతిభను నిరూపించుకుంటూ కెరీర్‌ను కొనసాగించడం మాత్రం అంత సులువైన విషయం కాదు. అయినప్పటికీ ఏదో ఒక రోజు తన సంగీతం ప్రేక్షకులను చేరుకుంటుందనే నమ్మకంతో అరవింద్ ముందుకు సాగుతుంటాడు.
ఈ సందర్బంగా అనిరుద్ మాట్లాడుతూ ‘‘‘అరవింద్’ అంటే ప్రతి ఒక్కరిలో ఉండే ఓ తరహా వ్యక్తిత్వమే. మన అందరి జీవితాల్లో ఓ అరవింద్ ఉంటాడు. అయితే తన ప్రతిభను చూపించడానికి ఒక్క అవకాశం కోసం ఎదురుచూస్తోన్న ఓ స్వతంత్ర కళాకారుడి కథను ఈ పాట చెబుతుంది. అలాగే నేటి డిజిటల్ ప్రపంచంలో ఉన్న విపరీతమైన పోటీలో పెద్ద స్థాయికి చేరుకునే సమయంలో ఒక ఇండిపెండెంట్ ఆర్టిస్ట్ ఎదుర్కొనే సవాళ్లను ఇది చూపిస్తుంది” అన్నారు.
ఈ పాటకు అనిరుధ్‌కు వ్యక్తిగతంగా కనెక్టింగ్‌గా ఉంటుంది. ఎందుకంటే తను కూడా జీవితంలో ఒకప్పుడు అరవింద్ వంటి దశను ఎదుర్కొన్నవాడే. ఈ పాట ద్వారా ఇలాంటి ప్రయాణంలో ఉన్న ఇతర కళాకారులు, క్రియేటివ్ వ్యక్తులతో అనుబంధం ఏర్పరచుకోవాలని ఆయన ఆశిస్తున్నారు. అలాగే తన ఎదుగుదల, ఎదురైన సవాళ్లు, అలాగే మొత్తం ఇండస్ట్రీ పై ధైర్యంగా, ఆత్మపరిశీలనతో కూడిన వ్యాఖ్యలనును కూడా ఈ పాట ద్వారా తెలియజేస్తున్నారు.
అల్బుకర్కీ రికార్డ్స్ ద్వారా రాబోయే రోజుల్లో వివిధ రకాలైన ఇండిపెండెంట్ మ్యూజిక్ ప్రాజెక్ట్స్ , కాన్సెప్చువల్ ప్రాజెక్ట్స్‌ను డెవలప్ చేసి రిలీజ్ చేయటానికి అనిరుద్ సిద్ధమవుతున్నారు.
https://youtu.be/EInkFse0QeQ
భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఓటీటీ వేదిక ప్రైమ్ వీడియో తన తాజా తెలుగు ఒరిజినల్ సిరీస్ ‘ఇసకపట్నం’ ట్రైలర్ను హైదరాబాద్ లో ఘనంగా విడుదల చేసింది. గ్యారీ బీహెచ్ దర్శకత్వం వహించిన...
లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు లేటెస్ట్ గోల్డెన్ బ్లాక్ బస్టర్ 'సింగ్ గీతం'. ప్రతిష్టాత్మక బ్యానర్లు వైజయంతి మూవీస్, స్వప్న సినిమా పై నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆయాన్, అహల్యా...
దుల్కర్ సల్మాన్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘ఐ యామ్ గేమ్’ నుంచి తాజాగా విడుదలైన పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. కొత్త పోస్టర్‌లో దుల్కర్ సల్మాన్ అత్యంత స్టైలిష్ అవతార్‌లో కనిపిస్తూ సినిమాపై...
ఆర్ఎక్స్ 100, మంగళవారం చిత్రాలతో భారీ బ్లాక్‌బస్టర్స్ ను అందించిన దర్శకుడు అజయ్ భూపతి, జయ కృష్ణ ఘట్టమనేనిని తెలుగు చిత్రసీమకు పరిచయం చేస్తూ 'శ్రీనివాస మంగాపురం' తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంతో బాలీవుడ్...
జీకే మిరాకిల్స్ బ్యానర్‌పై ఘంటాడి కృష్ణ దర్శకత్వంలో, సందీప్ అశ్వ హీరోగా తెరకెక్కిన యూత్‌ఫుల్ సస్పెన్స్ థ్రిల్లర్ “రిస్క్” ప్రపంచవ్యాప్తంగా జూన్ 26న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. ఇటీవల విడుదలైన ట్రైలర్,...