వైవిధ్యమైన పాత్రల్లో నటించి విలక్షణ నటుడిగా పేరు పొందిన స్టార్ యాక్టర్ ఫహాద్ ఫాజిల్, ఇండస్ట్రీ హిట్ బాహుబలి మూవీని నిర్మించిన మేకర్స్‌తో పాటు సెన్సేషనల్ డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి కలయికలో రూపొందుతోన్న చిత్రం...
హీరో కార్తి తమిళం, తెలుగు భాషల్లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన ‘సర్దార్’ మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ ‘సర్దార్ 2’తో సెప్టెంబర్ 10న వరల్డ్‌వైడ్‌గా థియేటర్లలోకి వస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ ఈ చిత్రాన్ని...
నేషనల్ క్రష్ రష్మిక మందన్న తన కెరీర్‌లో ప్రతిష్టాత్మక పాన్-ఇండియా యాక్షన్ డ్రామా 'మైసా'లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో గోండ్ గిరిజన మహిళ పాత్ర పోషిస్తున్న రష్మిక , ఆ పాత్రలో ఒదిగిపొవడానికి...
బాలీవుడ్ స్టార్స్ పంకజ్ త్రిపాఠి, దివ్యేందు, అలీ ఫజల్ ప్రధాన పాత్రల్లో నటించిన క్రైమ్ యాక్షన్ డ్రామా ‘మిర్జాపూర్ ది మూవీ’. టాప్ వెబ్ సిరీస్ ‘మిర్జాపూర్’కు కొనసాగింపుగా తెరకెక్కిన ఈ చిత్రంపై...
తిరుపతిలోని ఎస్‌వీబీసీ ఛానెల్ కార్యాలయంలో మంగళవారం నాదనీరాజనం కార్యక్రమంలో ప్రదర్శనలు ఇచ్చే కళాబృందాల ఎంపిక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి టీటీడీ ఎస్‌వీబీసీ చైర్మన్ శ్రీ బి శ్రీధర్ వర్మ అధ్యక్షత వహించారు.
కళా,...
మాస్ మహారాజా రవితేజ సోదరుడి తనయుడు, నటుడు రఘు కుమారుడు మాధవ్ విలేజ్ యాక్షన్-డ్రామా 'మారెమ్మ'తో హీరోగా పరిచయం అవుతున్నారు. మంచాల నాగరాజ్ దర్శకుడిగా పరిచయం అవుతుండగా, మోక్ష ఆర్ట్స్ సంస్థ ఈ...
శ్రవణ్, మలైకా టి వాసుపల్ జంటగా నటిస్తున్న సినిమా "చకోర- లూనార్ లవ్ బర్డ్". ఈ చిత్రాన్ని వీఐపీ వింటేజ్ ఐకానిక్ పిక్చర్స్ సారథ్యంలో హై జాయ్ కమర్షియల్స్ బ్యానర్ పై ప్రొడ్యూసర్...
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ నుంచి నాలుగో పాట ‘సబ్‌కో’ నేడు విడుదలైంది. ఇప్పటికే సినిమాపై, ఆల్బమ్‌లోని పాటలపై...
నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్” కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు.
దుల్కర్ సల్మాన్ భారీ బడ్జెట్ ఫాంటసీ థ్రిల్లర్ ‘ఐయామ్ గేమ్’ . మెగా బ్లాక్‌బస్టర్ ‘లోకా చాప్టర్ 1: చంద్ర’ తర్వాత వే ఫేరర్ ఫిల్మ్స్ నుంచి వస్తున్న ఈ చిత్రాన్ని సూపర్‌హిట్...