బుజ్జి థీమ్ మ్యూజిక్ విడుదల చేసిన ‘కల్కి 2898AD’ టీం

పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ వెయిటింగ్ సినిమా కల్కి 2898AD నుండి బుజ్జి థీమ్ మ్యూజిక్ విడుదల అయింది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను వైజయంతి ఫిలిమ్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ప్రముఖ నటీనటులుగా అమితాబ్ బచ్చన్, దీపికా పడుకొని, కమల్ హస్సన్ మరికొందరు కేకల పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమానుండి బుజ్జి & భైరవ లను ఈ చిత్ర టీం పరిచయం చేసింది. ఈరోజు సరిగమ లో ఈ సినిమా నుండి బుజ్జి థీమ్ మ్యూజిక్ ను 47 సెకండ్లు విడుదల చేసింది. ఈ మ్యూజిక్ తో పాటు ఆ వీడియోలో కొన్ని విసుఅల్స్ కూడా మాయమరిపిస్తున్నాయి.