వార్ మొదలు పెట్టిన వాళ్లు హ్యాపిగా ముగిస్తారా?

దసరా తర్వాత స్టార్ హీరో సినిమా పడకపోవడంతో సినీ అభిమానులు, ట్రేడ్ వర్గాలు బాగా డల్ అయ్యాయి. చిన్న సినిమాలు, కంటెంట్ ఉన్న చిత్రాలు, డబ్బింగ్ మూవీస్… ఈ వ్యాక్క్యూమ్ ని ఫిల్ చేసినా కాసుల వర్షం కురిపించే రేంజ్ మూవీ మాత్రం పడలేదు. ఆ లోటు తీర్చడానికి, సాలిడ్ కమర్షియల్ హిట్ ఇవ్వడానికి మెగా నందమూరి హీరోలు రాబోతున్నారు. ఈ ఇయర్ ని స్టార్ట్ చేసింది కూడా మెగా నందమూరి హీరోలే కావడం విశేషం. ఎన్టీఆర్ కథతో బాలయ్య నటించిన కథానాయకుడు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటించిన వినయ విధేయ రామ సినిమాలు ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకి వచ్చాయి.

క్రిష్, బోయపాటిలు తెరకెక్కించిన ఈ రెండు సినిమాలు సంక్రాంతికి బాక్సాఫీస్ రికార్డులు తిరగరాస్తాయి అనుకున్నారు. కథానాయకుడు, వినయ విధేయ రామ సినిమాలు డబ్బులు అయితే రాబట్టాయి వచ్చాయి కానీ ఆశించిన స్థాయి రిజల్ట్ మాత్రం దక్కించుకోలేకపోయాయి. సంక్రాంతి ఇచ్చిన బాడ్ మెమరీని మర్చిపోతూ డిసెంబర్ ని ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు. జై సింహా కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ రానున్న రూలర్ సినిమాతో హిట్ కొట్టి ఈ ఇయర్ ని సక్సస్ ఫుల్ గా క్లోజ్ చేయాలని బాలయ్య ప్లాన్ చేశాడు. దీనికి పోటీగా మళ్లీ మెగా హీరో వచ్చి చేరాడు. సంక్రాంతికి మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో పోటీ పడితే, ఇప్పుడు సుప్రీమ్ హీరోతో పడుతుంది. చిత్రలహరితో హిట్ ట్రాక్ ఎక్కిన సాయి ధరమ్ తేజ్, మారుతితో కలిసి చేస్తున్న సినిమా ప్రతి రోజు పండగే. ఈ మూవీ కూడా రులెర్ రిలీజ్ అయ్యే రోజే ప్రేక్షకుల ముందుకి రానుంది.

రూలర్, ప్రతి రోజు పండగే సినిమాల మధ్య డిస్కో రాజా కూడా ఉండాల్సింది కానీ మూవీని పోస్ట్ పోన్ చేస్తూ రవితేజ స్టేట్మెంట్ ఇచ్చాడు. మాస్ మహారాజ సైడ్ అవ్వడంతో డిసెంబర్ వార్ లో మెగా నందమూరి హీరోలు మాత్రమే మిగిలారు. ఒక కమర్షియల్ సినిమా, మరొకటి కంప్లీట్ ఫ్యామిలీ సినిమా… రెండు వేరు వేరు జానర్స్ కాబట్టి సినీ అభిమానులు థియేటర్స్ కి వెళ్తారు. 2019 సంక్రాంతి మిస్ టార్గెట్ ని మెగా నందమూరి హీరోలు, ఇప్పుడు సాలిడ్ హిట్స్ కొట్టి, ఈ ఇయర్ కి పర్ఫెక్ట్ అండ్ హ్యాపీ ఎండింగ్ ఇస్తారేమో చూడాలి.