ఎన్టీఆర్ బాటలో బన్నీ… సుకుమార్ సినిమా కోసమే

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’ సినిమా పనులతో బిజీగా ఉన్నాడు. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకి రానున్న ఈ మూవీ ప్రొమోషన్స్ ఫుల్ స్వింగ్ లో జరుగుతున్నాయి. ఇది అయ్యాక బన్నీ సుకుమార్ సినిమా మొదలుపెట్టనున్నాడు. శేషాచలం అడవుల్లో జరిగే ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా రూపొందనుంది. ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే చిత్తూరు జిల్లా వ్యక్తిగా కనిపిస్తాడని సమాచారం. ఈ మూవీ గురించి వస్తున్న లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం, అల్లు అర్జున్ లారీ డ్రైవర్ గా రఫ్ లుక్ లో కనిపించనున్నాడట. ఇప్పటివరకూ స్టైలిష్ స్టార్ గా మాత్రమే ప్రేక్షకులకి కనిపించిన బన్నీ, వేదం సినిమాలో మాత్రమే కేబుల్ రాజుగా కనిపించి మెప్పించాడు.

sukumar bunny
Allu Arjun Sukumar Movie opening

మళ్లీ ఇన్ని రోజుల తర్వాత అల్లు అర్జున్, కంప్లీట్ డౌన్ టు ఎర్త్ దిగి చేస్తున్న పాత్ర ఇదే, లారీ డ్రైవర్ అనగానే క్యారెక్టర్ లోనే రగ్గడ్ నెస్ ఉంటుంది. అలాంటి ఊరమాస్ లుక్ లో అల్లు అర్జున్, చిత్తూరు యాసలో కూడా మాట్లాడతాడని అంటున్నారు. ఈ యాస కోసం బన్నీ ట్రైనింగ్ కూడా తీసుకోబోతున్నాడు. ఈ విషయంలో పెంచల్ దాస్, అల్లు అర్జున్ కి హెల్ప్ చేసే అవకాశం ఉంది. త్రివిక్రమ్ తెరకెక్కించిన అరవింద సమేతలో కూడా ఎన్టీఆర్ కి రాయలసీమ మాండలికంపై పట్టి వచ్చేలా, యాసని పర్ఫెక్ట్ గా పట్టేలా పెంచల్ దాస్ చేశాడు. రామ్ చరణ్ ని గోదావరి యాసతో మాట్లాడించి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన సుకుమార్, ఇప్పుడు బన్నీని సీమ యాసలో మాట్లాడించి ఎలాంటి హిట్ ఇస్తాడు అనేది చూడాలి.