Japan: గతేడాది చైనా నుంచి వ్యాప్తి చెంది ప్రపంచాన్ని చుట్టేసిన కరోనా మహమ్మారి ఎందరి జీవితాలను పొట్టనపెట్టుకున్నది. ప్రజల ప్రాణాలతోపాటు జీవనోపాధిపై పెను ప్రభావం చూపింది. ఇక తాజాగా మరోసారి విజృంభించడానికి వస్తోంది మన కరోనా.. కానీ ఇప్పుడు జపాన్ దేశంలో.. మరో కొత్త రకం కరోనా వైరస్ రకాన్ని గుర్తించినట్లు Japan జపాన్ ప్రభుత్వం నేడు ప్రకటించింది. తూర్పు జపాన్‌లోని కాంటే ప్రాంతంలో 91కేసులు, విమానాశ్రయాల్లో రెండు కేసుల్లో ఈ కొత్త రకం మహమ్మారిని కనగొన్నట్టు తెలిపింది.
దీనితో టోక్యో ఇమ్మిగ్రేషన్ కేంద్రంలో ఓ ఇన్ఫ్క్షన్ క్లస్టర్‌ను ఏర్పాటుచేశారు. ఆ కరోనా కంటే ఇది ఇంకా విభిన్నంగా ఉందని.. ఇప్పటికే వేరే దేశాల్లో ఉత్పన్నమై ఉంటుందని ఇక్కడి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫెక్షన్ డిసీజెస్ వెల్లడించింది. వ్యాక్సిన్ పనితీరును దెబ్బతీసే ఈ484కే మ్యూటేషన్‌ను.. ఈ కొత్త రకం కరోనా వైరస్‌లో కనుగొన్నామని నిపుణులు పేర్కొన్నారు. ఈ కొత్త వైరస్ మరింత త్వరగా వ్యాపించవచ్చని.. తద్వారా దేశంలో కేసుల సంఖ్య అధికమయ్యే అవకాశముందని అక్కడి అధికారులు తెలిపారు. దీంతో దీనిని ఎలాగైనా అడ్డుకట్ట వేయాలని Japanజపాన్ ప్రభుత్వం మరింత అప్రమత్తమవుతుంది. ఇదిలా ఉంచితే.. భారత్ విషయానికొస్తే.. కరోనా అంటే భయంలేదు.. ఏ ఎప్పుడో పోయింది కదా కరోనా.. వ్యాక్సిన్ వచ్చింది కదా.. అంటూ కరోనా నిబంధనలు పాటించటం లేదు.. తప్పకుండా ప్రజలందరు మాస్క్‌లు, శానిటైజేషన్ వంటి నిబంధనలు పాటించాల్సిందిగా కోరుతున్నారు. ఒక్కరు పాటిస్తే దేశం మొత్తం పాటిస్తుంది.. అందుకే ఆ ఒక్కరు మీరు కూడా కావచ్చు కదా..