Uppena: ఉప్పెన డైరెక్ట‌ర్‌కు స్టార్ హీరో నుంచి ఆఫ‌ర్‌..

Uppena: ఉప్పెన చిత్రంతో డెబ్యూ హీరో వైష్ణ‌వ్‌తేజ్‌, హీరోయిన్ కృతిశెట్టి, మ‌రీ ముఖ్యంగా డైరెక్ట‌ర్ బుచ్చిబాబుకు టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో ఎంతో పేరు సంపాదించుకున్నారు. ప్రేక్ష‌కులు ఉప్పెన చిత్రానికి బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. ప్రేక్ష‌కుల్లో చిర‌కాల స్థాయిలో గుర్తుండిపోయే విధంగా ఉప్పెన చిత్రాన్ని తెర‌కెక్కించాడు డైరెక్ట‌ర్ బుచ్చిబాబు సానా. అలాగే వైష్ణ‌వ్‌తేజ్ డెబ్యూ హీరోగా Uppenaఈ చిత్రంతో రికార్డులు సృష్టించాడు.

director buchibabu

దీంతో డైరెక్ట‌ర్‌కు ఉప్పెన‌లా ఆఫ‌ర్లు వ‌స్తున్నాయి.. వ‌రుస‌గా స్టార్ హీరోలు నాతో చేయ‌మ‌ని డైరెక్ట‌ర్ బుచ్చిబాబును అడుగుతున్నారు. Uppenaఉప్పెన చిత్రాన్ని నిర్మించిన మైత్రీమూవీ మేక‌ర్స్ సంస్థ‌లోనే రెండు సినిమాలు అగ్రిమెంట్ కుదుర్చుకుంద‌ని స‌మాచారం. మ‌రోప‌క్క‌. అక్కినేని నాగార్జున త‌న కొడుకు అఖిల్ కోసం క‌థ‌ను సిద్ధం చేయ‌మ‌ని ఆఫ‌ర్ ఇచ్చాడ‌ట‌. అలాగే యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ నుంచి భారీ ఆఫ‌ర్ వ‌చ్చింద‌ట‌. ఈ సినిమా మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ‌లోనే ఉంటుంద‌ని స‌మాచారం. టాలీవుడ్ లో Uppenaబుచ్చిబాబు డైరెక్ట‌ర్‌గా చాలా బిజీ అయిపోతున్నాడ‌ని అంద‌రూ అంటున్నారు.