మెగాస్టార్ సినిమా కోసం బాలీవుడ్ విలన్?

బాహుబలి సూపర్ సక్సెస్ తరువాత, భాషం బేధం లేకుండా అన్ని రకాల మంచి సినిమాలకు మంచి క్రేజ్ దక్కుతోంది. ఇక టాలీవుడ్ మేకర్స్ కీలకమైన పాత్రల కోసం బాలీవుడ్ నటులను సంప్రదిస్తున్నారు. పాన్ ఇండియా కోసం నార్త్ నటులను తప్పక తీసుకోవాల్సి వస్తోంది. అయితే ఒక రీమేక్ కోసం మెగాస్టార్ చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. అదే వేదాలం. దర్శకుడిగా మెహర్ రమేష్ కూడా ఫిక్స్ అయ్యారు. ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రారంభమవుతుంది. ఇక కీర్తి సురేష్ చిరంజీవి సోదరి పాత్రలో నటించడానికి ఓకే చెప్పినట్లు సమాచారం.

ఇక ప్రస్తుతం ఈ చిత్రానికి ప్రధాన విలన్ కోసం వెతుకుతున్నట్లు సమాచారం. ఈ ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్లో బాలీవుడ్ నటుడు కనిపించడానికి రెడీ అవుతున్నారట. మెహర్ రమేష్ ఇప్పటికే ఒక లిస్ట్ కూడా రెడీ చేశారట. ఆ జాబితాతో మొత్తం స్టార్స్ ఉన్నట్లు టాక్. ఎక్కువగా టైగర్ ష్రాఫ్ పేరు వినిపిస్తోంది. ఇక వారిలో ఒకరు చిరంజీవితో చర్చించిన అనంతరం డిసైడ్ చేస్తారట. మెగాస్టార్ ఒప్పుకున్న తరువాతే నటులను సంప్రధించాలని మెహర్ రమేష్ ఒక ప్లాన్ ప్రకారమే ప్రీ ప్రొడక్షన్ పనులను కొనసాగిస్తున్నట్లు సమాచారం. ఇక ఈ చిత్రం షూటింగ్ ని నెక్స్ట్ ఇయర్ అనుకున్న సమయానికి స్టార్ట్ కానుంది.