ఈ స్టార్స్ అందరూ కూడా చాలా దగ్గరి బంధువులు అని మీకు తెలుసా?

సినిమా ఇండస్ట్రీలో సోదరభావం చాలా పెద్దది, ఇక్కడ కొంతమంది ప్రతిభావంతులైన సినీ స్టార్స్ బ్లడ్ రిలేషన్స్ ద్వారా ఒకరికొకరు సంబంధం కలిగి ఉన్నారని మీకు తెలుసా, సుదూర బంధువులు చాలా మందే ఉన్నారు. ఒకసారి అలాంటి వారిపై ఒక లుక్కేస్తే..

జోయా అక్తర్- ఫర్హాన్ అక్తర్ ల తల్లి డైసీ ఇరానీ, ఇక సాజిద్ ఖాన్ – ఫర్హాన్ ఖాన్ ల తల్లి మనీకా ఇరానీ సొంత అక్క చెల్లెల్లు కావాదంతో ఈ స్టార్స్ కజిన్స్ బయ్యారు. ఫర్డెన్ ఖాన్, జయేద్ ఖాన్ లు ఇద్దరు కూడా ఫీరోజ్ ఖాన్ కొడుకులు. సంజయ్ ఖాన్ కూడా వీరికి వరుసకు సోదరుడే అవుతాడు.

రొమాంటిక్ బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీ పూజా భట్ కి కజిన్ అవుతాడు. ఎందుకంటే ఇమ్రాన్ తల్లి, అలియా భట్ తండ్రి అన్నా చెల్లెల్లు కాబట్టి. కాజోల్, తనిషా ఇద్దరు కూడా రాణి ముఖర్జీ సెకండ్ కజిన్స్. ఇక ఆయన్ ముఖర్జీ, కాజోల్ కి మొదటి కజిన్ అవుతాడు. అలాగే సురభి ముఖర్జీకి అతను సెకండ్ కజిన్ అవుతాడు. ఇక యువ హీరో అర్జున్ కపూర్, సోనమ్ కపూర్ కి మొదటి కజిన్ అవుతాడు. ఎందుకంటే అర్జున్ కపూర్ తండ్రి బోణి కపూర్, సోనమ్ తండ్రి అనిల్ కపూర్ అన్నదమ్ములు కాబట్టి