కార్తీ దెబ్బకి బిగిల్ కి సొంతగడ్డపైనే కష్టాలు తప్పలేదు

దీపావళికి ప్రేక్షకుల ముందుకి వచ్చిన రెండు భారీ సినిమాలు ఖైదీ, బిగిల్. విజయ్, కార్తీలు నటించిన ఈ చిత్రాలు తెలుగు రాష్ట్రాల్లో భారీ కలెక్షన్స్ రాబట్టాయి. బిగిల్ మంచి ఓపెనింగ్స్ తెచ్చుకోని అదే జోష్ ని రెండు వరాల పాటు కంటిన్యూ చేసి 200 కోట్లు రాబట్టింది. ఖైదీ అంచనాలు లేకుండా రిలీజ్ అయ్యి బ్రేక్ ఈవెన్ చేరి లాభాల బాటలో నడుస్తోంది. అయితే మూడో వారంలోకి ఎంటర్ అయిన ఖైదీ స్ట్రాంగ్ హోల్డ్ మైంటైన్ చేస్తుంటే, బిగిల్ కంప్లీట్ గా స్లో అయ్యింది.

karthi vijay

దాదాపు 84 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ చేసిన బిగిల్, ఇప్పటివరకూ 124 కోట్ల గ్రాస్ రాబట్టింది. షేర్ రూపంలో చెప్పాలి అంటే బిగిల్ 75 కోట్ల వరకూ వసూల్ చేసింది, అంటే బిగిల్ తమిళ నట క్లీన్ హిట్ గా నిలవాలి అంటే మరో 9 కోట్లు రాబట్టాలి. ఖైదీ మౌత్ టాక్ స్ప్రెడ్ అవ్వడం, బిగిల్ ఫుట్ ఫాల్స్ బాగా తగ్గడంతో రానున్న రోజుల్లో ఈ సినిమా 9 కోట్లు రాబట్టడం కష్టంగానే కనిపిస్తోంది. ఇండస్ట్రీని షేక్ చేసే రేంజులో ఓపెనింగ్స్ రాబట్టిన సినిమా, బ్రేక్ ఈవెన్ కూడా చేరకుండా సొంత గడ్డలోనే నష్టాల్లో ముగుస్తుందని ఎవరూ ఊహించి ఉండరు.