అతని జ్ఞాపకాలని చెరిపేశా… ఇక నేను ఇలానే ఉంటాను

దేవదాస్ సినిమాతో తెలుగు యూత్ ని కట్టిపడేసిన హీరోయిన్ ఇలియానా, రీసెంట్ గా తన బాయ్ ఫ్రెండ్ కి బ్రేక్ అప్ చెప్పేసింది. ప్రేమలో ఉండగా సినిమాలకి దూరమై బాగా లావు అయిన ఇలియానా, ఇప్పుడు తిరిగి షేప్ లోకి రావడానికి ప్రయత్నిస్తూ బాగా సన్నబడింది. తెలుగులో సినిమాలు చేయకున్నా బాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ సెలెక్టీవ్ సినిమాలు చేస్తున్న ఇలియానా, రీసెంట్ గా తన బ్రేక్ అప్ గురించి ఓపెన్ అవుతూ… ఇంకెప్పుడూ ఎవరినీ ప్రేమించనని క్లియర్ గా చెప్పేస్తోంది.

తన లవ్ అండ్ బ్రేక్ అప్ గురించి మాట్లాడిన ఇలియానా, ”నేను ఎప్పుడూ శత్రువుగా మిగలాలనుకోను. శత్రువులను పెంచుకోను. ఆయన నా నుంచి వెళ్లిపోయారు. అది అలా జరిగిపోయింది. జీవితం అలా సాగిపోతుంది. ఆయన గురించి ఎటువంటి చెడు ఆలోచన లేదు. అతనికీ అంతా మంచే జరగాలి. ఇప్పుడు నేను సంతోషంగా ఉన్నా. నన్ను నేనే ప్రేమించుకుంటున్నా ఇకపై ఎవ్వరినీ ప్రేమించడానికి సిద్ధంగా లేను. ‘ అని చెప్పింది ఇలియానా. ఆస్ట్రేలియా ఫొటోగ్రాఫర్‌ ఆండ్రూ కీబోనేతో లివ్ ఇన్ రిలేషన్ ని మైంటైన్ చేసిన ఇలియానా, ఆగస్టులో అతని నుంచి విడిపోయింది.