తన సినిమా చూడామని బాదపడుతున్న సోహెల్

బిగ్ బాస్ ద్వారా ఫేమస్ అయ్యి బయటకు వచ్చి హీరోలుగా అలాగే హీరోయిన్గా, ఆర్టిస్టుగా మారిన వారు చాలామంది ఉన్నారు. ఆ తరహాలోనే బిగ్ బాస్ సీజన్ ఫోర్ లో ముక్కుసూటి మనిషిగా మంచి పేరు తెచ్చుకుని బయటకు వచ్చాక ఓ మంచి నటుడిగా అలాగే హీరోగా ప్రసిద్ధి చెందాడు సొహెల్. అయితే ఇటీవల తన బూట్ కట్ బాలరాజు సినిమా రిలీజ్ అయిన విషయం అందరికీ తెలిసిందే. తన సినిమాకి తానే నిర్మాతగా చేస్తూనే ఆ సినిమాలో హీరోగా నటించాడు.

అయితే సొహెళ్ సినిమా థియేటర్ కి వెళ్లి చూడగా సీట్లు కొన్ని కాళీ ఉండటంతో ఎమోషన్ అయ్యారు. తాను బిగ్ బాస్ లో ఉన్నప్పుడు తనకు సపోర్ట్ చేసిన తన అభిమానులు, ప్రేక్షకులు ఇప్పుడు ఎందుకు తనకు సపోర్ట్ చేయడం లేదని, తన సినిమా ఎందుకు చూడటం లేదని అన్నారు. ఇటువంటి క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాలు తక్కువగా వస్తున్నాయని, అటువంటి సినిమాలలో ఒకటి తమ బూట్ కట్ బాలరాజు అని అన్నారు. తమ సినిమాని కుటుంబ సమేతంగా అందరూ వచ్చి చూడాలని సోహెల్ కోరారు. మంచి సినిమా తీస్తే ఎవరూ చూడటం లేదని, ఇకపై తాను అడల్ట్ సినిమాతోనే వస్తానని అన్నారు. తమ దగ్గర ప్రమోషన్స్ చేయడానికి కూడా డబ్బు లేదు అని, థియేటర్లు నిండక పోవడంతో షోస్ క్యాన్సిల్ అవుతున్నాయని సోహెళ్ బాధపడ్డారు.