యూత్ ఐకాన్ “ఇనయా సుల్తానా”” తో రాబోతున్న నర్రా శివనాగు సినిమా

బిగ్ బాస్ 6 లో సంచలనం సృష్టిస్తూ ఎంతోమంది యూత్ ఫాన్స్ తో హల్ చల్ చేస్తున్న ఇనయా సుల్తానా తన అందచందాలను ఆరబోసి హీరోయిన్ గా నటించిన చిత్రం””నటరత్నాలు””.

కామెడీ కింగ్స్ రంగస్థలం మహేష్, సుదర్శన్ రెడ్డి, తాగుబోతు రమేష్ లు “”నటరత్నాలు”” గా యాక్టింగ్ లో జీవించేశారు.

సుమన్ శెట్టి, అర్చన, అర్జున్ తేజ్, టైగర్ శేషాద్రి, శివ నాగేంద్ర సిద్దాంతి (విష్ణు వర్ధన్), సూర్య కిరణ్, ఎ.ఎస్. రవి కుమార్ చౌదరి లు మాత్రం నటనను చించి చాటచేసి ఇరగతీశారంటే నమ్మండి.

ఇంకా దర్శకుడు నర్రా శివనాగు అంటారా….
తను మనసులోని మేధస్సును కరిగించి ఒక కామెడీ, క్రైమ్ కథను సృష్టించి, మెగాఫోన్ పట్టుకుని తన టాలెంట్ నంతా బయటకు తీసి “”నటరత్నాలు “” పేరుతో యూత్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ కి మంచి రుచికరమైన విందు తయారు చేశాడు. ఇక దీన్ని ఎవరెస్ట్ ఎంటర్ టైన్మెంట్స్ అనే ఫైవ్ స్టార్ హోటల్ పేరుతో మంచి రుచికరమైన విందు ను ఫిబ్రవరిలో వడ్డించడానికి, నిర్మాతలు డా. దివ్య, ఆనందాసు శ్రీ మణికంఠ, చంటి సిద్దమవుతున్నారు.
మరి మీరుకూడా ఆనందించడానికి సిద్దమేనా!