పాలిటిక్స్ లోకి మాస్ లుక్ తో తారకరత్న ఎంట్రీ..

నందమూరి ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చిన వారిలో తారకరత్న ఒకరు. ఇక ఇప్పుడు పాలిటిక్స్ లోకి సరికొత్తగా గుర్తింపు అందుకునేందుకు అతను రెడీ అయినట్లుగా తెలుస్తోంది. అయితే ఇటీవల తారకరత్న జూనియర్ ఎన్టీఆర్ పై చేసిన కామెంట్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అలాగే అతని లేటెస్ట్ ఫోటోలు కూడా చాలా డిఫరెంట్ గా ఉండడంతో అవి కూడా వైరల్ అవుతున్నాయి. పూర్తి వివరాలలోకి వెళితే..

గతంలో రెగ్యులర్ పాలిటిక్స్ లో పెద్దగా కనిపించని తారకరత్న ఇప్పుడు మాత్రం క్రియాశీలక రాజకీయాల్లో బిజీగా మారెందుకు ప్రయత్నాలు మొదలుపెట్టేసాడు. ఇటీవల తను ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి రాబోతున్నట్లుగా ఒక ప్రకటన అయితే ఇచ్చేశాడు. భారీ స్థాయిలో తెలుగుదేశం పార్టీ నేతలతో ర్యాలీ నిర్వహించి మరి ఆంధ్రప్రదేశ్లో తన ఉనికిని చాటుకునెందుకు ప్రయత్నం చేస్తున్నాడు.

అయితే తారకరత్న ఇకనుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో బిజీగా ఉంటాను అని అంతేకాకుండా ప్రజా సమస్యలు తెలుసుకుని వచ్చే ఎన్నికల్లో కూడా పోటీ చేసే అవకాశం ఉంది అని అన్నాడు. ఇక తప్పకుండా రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది అని తారకరత్న తెలియజేశాడు. ఇక తారకరత్నకు సంబంధించిన లేటెస్ట్ లుక్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇక తారకరత్న జూనియర్ ఎన్టీఆర్ పై చేసిన కామెంట్స్ కూడా వైరల్ గా మారుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ కూడా తెలుగుదేశం పార్టీకి తప్పకుండా తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారాలలో పాల్గొంటాడని అన్నాడు. అయితే 2009 తర్వాత జూనియర్ ఎన్టీఆర్ మళ్లీ తెలుగుదేశం పార్టీ తరఫున ఎక్కడ కూడా ప్రచారాలు చేసింది లేదు. ఇప్పట్లో తాను రాజకీయాలకు వచ్చే అవకాశం లేదు అని కూడా అని అన్నాడు. మరి తారకరత్న ఇచ్చిన వివరణతో జూనియర్ ఎన్టీఆర్ ఏదైనా స్టేట్మెంట్ ఇస్తారో లేదో చూడాలి.