21 మంది హీరోయిన్లతో సినిమా

సినిమా అంటే ఒకరో, ఇద్దరో లేదా ముగ్గురో హీరోయిన్లు ఉంటారు. కానీ ఒక సినిమాలో ఏకంగా 21 మంది హీరోయిన్లు నటిస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. అవును.. ఇలాంటి ప్రయత్నమే ఇప్పుడు ఒకటి జరుగుతోంది. కన్నడ బిగ్‌బాస్ కంటెస్టెంట్ భువన్ పొన్నన్న హీరోగా ఒక రొమాంటిక్ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాకు ‘ప్రణయ రాజా’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. టీ.సుదర్శన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనుండగా.. లైకా ప్రొడక్షన్ బ్యానర్‌పై కొల్లూరు మూకాంబికా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వికాస్ రాజా వశిష్ట ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్‌గా వ్యవహరించనున్నారు.

bigg boss bhuvan ponnanna

రాజా శివ శంకర్ ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ అందించనున్నాడు. జనవరిలో ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్‌ను ప్రారంభించేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తన్నారు. ఈ సినిమాలో 21 మంది హీరోయిన్లు నటించనున్నారు. ఇందులో ప్రస్తుతం 18 మంది హీరోయిన్లు నటించడానికి ఒకే చెప్పగా.. మరో ఇద్దరితో చర్చలు జరుగుతున్నాయి. ముంబై, కర్ణాటక, బెంగాల్, ఇతర సినిమా ఇండస్ట్రీలకు చెందిన హీరోయిన్లు ఇందులో నటించనున్నారు.

ఒకేసారి 21 మంది హీరోయిన్లు నటించనుండటంతో.. ఈ సినిమాపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఇందులో ముగ్గురు స్టార్ హీరోయిన్లు కూడా ఉండటంతో.. భారీ అంచనాలు నెలకొన్నాయి. ఒకేసారి 21 మంది హీరోయిన్లు నటిస్తుండటంతో.. ఈ సినిమాకు భారీ బడ్జెట్ కానుంది.