ఎన్టీఆర్ టీజర్ సెన్సేషనల్ రికార్డు

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘RRR’ సినిమాలోని యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పాత్రకు సంబంధించిన కొమురం భీమ్ టీజర్ ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. మెగా పవర్ స్టార్ రాంచరణ్ దీనికి వాయిస్ ఓవర్ అందించగా.. ఇందులో ఎన్టీఆర్ చాలా పవర్‌ఫుల్‌గా కనిపించాడు. కొమురం భీమ్ పాత్రలో ఉన్న ఎన్టీఆర్ ఈ టీజర్‌లో ముస్లింలా కనిపించడం వివాదాస్పదంగా మారింది. సినిమాను అడ్డుకుంటామంటూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ వార్నింగ్ ఇచ్చారు.

BHEEM TEASER RECORD

అయితే ఈ టీజర్ యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పటికే ఈ టీజర్ 1 మిలియన్ లైక్స్‌తో పాటు 9 లక్షల కామెంట్స్ సాధించింది. మరికొద్దిరోజుల్లోనే 1 మిలియన్స్ కామెంట్స్‌కి చేరుకోనుంది. దీంతో 1 మిలియన్స్ లైక్స్, 1 మిలియన్స్ కామెంట్స్ సాధించిన తొలి ఇండియన్ సినిమా టీజర్‌గా రికార్డు సృష్టించనుంది. ఇందులో ఎన్టీఆర్ లుక్ కొత్తగా ఉండటంతో.. ఈ సినిమా కోసం తారక్ అభిమానులు ఎదురుచూస్తున్నారు.

ప్రస్తుతం RRR షూటింగ్ దాదాపుగా పూర్తి కావొచ్చింది. ఇటీవలే హైదరాబాద్‌లోని ప్రత్యేక సెట్‌లో ఈ సినిమా షూటింగ్ జరిగింది. దసరాకు ఈ సినిమాను విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఇప్పటికే విడుదలైన రాంచరణ్‌కు చెందిన అల్లూరి సీతారామరాజు టీజర్ కూడా యూట్యూబ్‌లో అత్యధిక వ్యూస్ సాధించింది. విడుదలకు ముందే RRR రికార్డులు సృష్టిస్తుండటంతో.. ఇక సినిమా ఎన్ని రికార్డులో సృష్టిస్తుందనే చర్చ జరుగుతోంది.