తెలుగు బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ నాలుగవ రోజుకు మరో యూ టర్న్ తీసుకుంది. అరియానా, సోహల్ సీక్రెట్ రూమ్ లో ఉంటూ మిగతా కంటెస్టెంట్స్ కి చిరాకు తెప్పిస్తుంటే.. మరోవైపు కట్టప్ప కాన్సెప్ట్ చాలా మందిలో తెలియని అనుమానాలను కలిగించింది. ఇక ఆ ఆలోచనలతో బిగ్ బాస్ వేసిన నిప్పురవ్వ ఒక్కొక్కరిలో కారు చిచ్చుగా మారుతోంది. ముఖ్యంగా కరాటే కళ్యాణి ఎక్కువ మందితో గోడవపడింది.
సుజాత, లాస్య, దేవి.. అలాగే సూర్య కిరణ్ లతో కళ్యాణి గొడవ పడటం హాట్ టాపిక్ గా మారింది. అరియానా గ్లోరికి కళ్యాణి అన్నం తినిపించడంతో దేవి చేసిన కామెంట్స్ ఇద్దరి మధ్య గొడవకు దారి తీసింది. ఇక సూర్య కిరణ్ కరాటే కళ్యాణిని అడ్డుకునే ప్రయత్నం చేసినా ఆమె వినలేదు. ఒక్క నిమిషం నా మాట విను, ఒక్క నిమిషం దాటితే చెప్పుతో కొట్టు అని వివరణ ఇచ్చారు. ఇక మరోవైపు గంగవ్వ కూల్ గా తన పని తాను చేసుకుంటూ ఉదయాన్నే వర్కౌట్స్ కూడా చేసింది. మరి ఈ రోజు కట్టప్ప కాన్సెప్ట్ ఎలాంటి వివాదాలకు దారి తీస్తుందో చూడాలి.