రవిప్రకాష్ ను టీవీ9 కొత్త యాజమాన్యం గెంటేశాక ఆ ఛానల్ పరుపు ప్రతిష్టలను కోల్పోయింది. అటువంటి సమయంలో టీవీ9ని రజినీకాంత్ నిలబెట్టాడనడంలో సందేహం లేదు. గందరగోళంలో పడ్డ టీవీ 9 టీం మొత్తాన్ని ఒక్కతాటిపైకి తెచ్చి కొత్త ప్రోగ్రాంలు పెట్టి తనదైన ముద్ర వేశాడు. రేటింగ్స్ పెంచి రవిప్రకాష్ లేని లోటు తీర్చాడు. అటువంటి రజినీకాంత్ టీవీ9 కి గుడ్ బై చెబుతున్నాడా ? నిజమేనంటున్నాయి మీడియా వర్గాలు.. రవిప్రకాష్ ను కొత్త యాజమాన్యం అవమానకర రీతిలో పంపించేసింది. ఇప్పడు రజినీకాంత్ యాజమాన్య విపరీత ధోరణలు నచ్చక తనంతట తానే వెళ్లిపోతున్నారని సమాచారం.
రజినీకాంత్ టీవీ 9 నుంచి వెళ్లిపోతే ఆ ఛానల్ అంతే సంగతులా? టీవీ 9 పని అయిపోయినట్లేనా? అవుననే అంటున్నాయి మీడియా వర్గాలు. టీవీ 9లో అణువణువూ తెలిసినవాడు.. స్టాఫ్ అందరికీ ఇష్టుడు.. కష్టకాలంలో అందరికీ తోడుగా ఉన్నవాడు.అందరికీ ధైర్యాన్ని ఇచ్చినవాడు. హఠాత్తుగా వెళ్లిపోతే టీవీ9 ఛానల్ పెను ప్రమాదంలో పడినట్లే. రవిప్రకాష్ ను పంపించేసినప్పడు రాని సంక్షోభం ఇప్పుడు టీవీ9ని సునామీలా చుట్టుకోబోతోందా? రజినీకాంత్ టీవీ 9ను బయటికి వచ్చేయడం ఖాయమేనా? అసలు మీడియాకే దూరంగా ఉండబోతున్నాడా ?