ముంబై రాక ముందే లాయర్లు ఎందుకో?

బాలీవుడ్ డ్రగ్ స్కాండల్ లో సెప్టెంబర్ 25న నార్కోటిక్స్ బ్యూరో ముందు విచారణకి హాజరు కానుంది బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే. ప్రస్తుతం గోవాలో షూటింగ్ లో ఉన్న ఈ బ్యూటీ విచారణకి ముంబై రావాల్సి ఉండగా, షూటింగ్ ని క్యాన్సిల్ చేసుకోని గోవాలోనే ముగ్గురు లాయర్లని పెట్టుకోని విచారణని ఎలా ఎదురు కోవాలి, బెయిల్ పరిస్థితి ఏంటి అనే విషయాలు మాట్లాడుతున్నట్లు సమాచారం. తప్పు చేయకుంటే విచారణకి రావాలి కానీ ముంబై కూడా రాకముందే లాయర్లతో కూర్చోని డిస్కషన్ చేయాల్సిన అవసరం ఏంటో దీపికకే తెలియాలి.

ఇదిలా ఉంటే నార్కోటిక్స్ సమన్లు అందుకున్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ రేపు విచారణకి హాజరు కానుంది. రియా చక్రవర్తిని కస్టడీలోకి తీసుకున్న తర్వాత వినిపించిన మొదటి పేరు రకుల్ దే… మరి రేపు ఆమె విచారణని ఎలా ఫేస్ చేస్తుంది? ఆమెని కూడా కస్టడీలో లోకి తీసుకుంటారా అనేది చూడాలి. రకుల్ ని కూడా కస్టడీలోకి తీసుకుంటే టాలీవుడ్ నుంచి మొదటిసారి రిమాండ్ కి వెళ్తున్న నటి ఆమెనే అయ్యి ఉంటుంది.