కరోనా నివారణకు ‘బాలయ్య’ సహాయం.. ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన ‘అసోసియేషన్స్’!!

నందమూరి బాలకృష్ణ కారోనా నివారణకు తనవంతు సహాయంగా చాలా మందికి ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ తరపున హోమియోపతి మరియు యాంటీఆక్సిడాంట్ , మల్టీవిటమిన్ & ముల్తిమినెరల్స్ క్యాప్సూల్స్ మందులను మా సభ్యులకు ఉచితంగా పంపిణీ చేయాలని ముందుకు వచ్చారు. ఇక రీసెంట్ గా మా సభ్యులకు ఉచితంగా పంపిణీ చేయడంతో కొన్ని అసోసియేషన్స్ బాలకృష్ణకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశాయి.

ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ వారికి మరియు హెల్త్ ఆర్గనైజింగ్ శ్రీ మూర్తి గారికి , దానికి సహకరించిన NBK కాస్ట్యూమ్స్ ABR మోహన్ రావు గారికి తెలుగు సిని స్టిల్ ఫోటోగ్రాఫర్స్  అసోసియేషన్ తరపున ధన్యవాదాలు తెలియ చేయుచున్నట్లు ప్రెసిడెంట్: G.శ్రీను ట్రసరర్: A.వీరభద్రరావు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇక సినీ పబ్లిసిటీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్: సిహెచ్.రాంబాబు సెక్రటరీ విక్రమ్ రమేష్, ట్రెజరర్: ఎ.ఈశ్వర్ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. తెలుగు సిని ఆడియోగ్రాఫర్స్ అసోసియేషన్ నుండి మహారాజ శ్రీ నందమూరి బాలకృష్ణ గారికి కృతజ్ఞతలు అంటూ ప్రెసిడెంట్:కొల్లి రామకృష్ణ ట్రసరర్: జె.రాఘవ చరణ్ లేఖ ద్వారా పేర్కొన్నారు.