‘సోనూ సూద్’ కి మొదటి అవకాశం ఎలా వచ్చిందంటే?

లాక్ డౌన్ సమయంలో నటుడు సోను సూద్ దేశవ్యాప్తంగా ఒక ఆపద్బాంధవుడిగా నిలిచిన విషయం తెలిసిందే. ఇక తన సేవా కార్యక్రమాలు ఏ మాత్రం ఆపకుండా పేదలకు సహాయం చేస్తున్నారు. ప్రముఖ పోడ్ క్యాస్ట్ షోలో తన మొదటి సినిమాకు వచ్చిన అవకాశం గురించి చెప్పాడు. సోనూ సూద్ మొదట తమిళ్ లో విజయకాంత్ నటించిన ‘కల్లాజగర్’ ఆమె సినిమాలో నెగిటివ్ పాత్రలో కనిపించాడు.

ఆ విషయం గురించి మాట్లాడుతూ.. సోను సూద్ తన బేర్ బాడీని ప్రజెంట్ చూపించిన తర్వాత సినిమాలో అవకాశం వచ్చిందని చెప్పాడు. సోను మాట్లాడుతూ “నా మొదటి ఆఫర్ వచ్చినప్పుడు, మా అమ్మ నాకు ‘తమిళం ఎలా నేర్చుకోవాలి’ అనే పుస్తకాన్ని బహుమతిగా ఇచ్చింది. తమిళ పదాలను కొంచెం నేర్చుకోవడం కష్టమే అనిపించింది. ఆడిషన్స్ కి వెళ్లినప్పుడు తప్పుగా మాట్లాడితే అక్కడ అసిస్టెంట్ డైరెక్టర్ ఒకరు నన్ను చూసి మీ బాడీ చూపిస్తారా అని అడిగారు. నేను చూపించగానే ఆయన వెంటనే మీరు మా సినిమా చేస్తున్నారు అనేశాడు. ఆ తరువాత నా జీవితం మారిపోతోంది అని ఊహించాను’ అని సోనూ సూద్ వివరణ ఇచ్చారు.