దసరాకు ప్రారంభంకానున్న బాలయ్య – అనిల్ రావిపూడి చిత్రం

ప్రస్తుతం ఎఫ్3 సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ తో బిజీగా ఉన్న అనిల్ రావిపూడి తన తదుపరి ప్రాజెక్ట్ నటసింహ నందమూరి బాలకృష్ణతో మాస్ మసాలా కమర్షియల్ ఎంటర్టైనర్ ని తెరకెక్కించనున్నారు. అత్యంత ఆసక్తికరమైన ఈ ప్రాజెక్ట్ ఈ దసరాకు అధికారికంగా ప్రకటించబడుతుంది. షైన్ స్క్రీన్స్ బ్యానర్ ఈ ప్రాజెక్ట్‌ని ప్రొడ్యూస్ చేయనుంది.

ఇటీవలి ఇంటర్వ్యూలలో, ఈ చిత్రం ఔట్ అండ్ అవుట్ కమర్షియల్ ఫిలిం అని మరియు నందమూరి అభిమానులకు పర్ఫెక్ట్ ఫీస్ట్ అని చెప్పారు చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి . ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ మాస్ ఎంటర్‌టైనర్‌లో బాలయ్య పోలీస్ పాత్రలో కనిపించనున్నారు. బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని తదుపరి చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.