బాలకృష్ణ, గోపీచంద్ మలినేని సినిమాకు అదిరిపోయే పవర్‌ఫుల్ టైటిల్..

‘అఖండ’ సక్సెస్‌ తర్వాత బాలకృష్ణ.. మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

ఈ సినిమాలో బాలయ్య మరోసారి డ్యూయల్ రోల్లో కనిపించనున్నట్టు సమాచారం. ఒక పాత్ర ఫ్యాక్షనిస్ట్ పాత్ర అయితే.. మరోకటి పవర్‌ఫుల్ పోలీస్ పాత్ర అని చెబుతున్నారు. ఈ సినిమాకు “వీర సింహ రెడ్డి ” అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఇక బాలయ్య ఇమేజ్‌కు తగ్గ సరైన టైటిల్ అంటున్నారు అభిమానులు. మొత్తంగా ఈ టైటిల్ ఫిక్స్ అయితే.. అభిమానులకు అంత కన్నా ఆనందం ఉండదు.

ఈ మూవీలో బాలయ్యను ఢీ కొట్టే విలన్ పాత్రలో కన్నడ నటుడు దునియా విజయ్ నటిస్తున్నారు. మరోవైపు ఈ సినిమాలో పవర్ ‌ఫుల్ లేడీ పాత్రలో వరలక్ష్మీ శరత్ కుమార్‌ను తీసుకున్నారు. శృతి హాసన్ ఈ సినిమాలో బాలయ్య సరసన నటిస్తోంది. ఈ సినిమాలో 9 హై యాక్షన్ ఫైట్స్ సీక్వెన్స్ లు డైరెక్టర్ ప్లాన్ చేసారని ఫిలిం నగర్ వర్గాల సమాచారం, దసరా పండగకి ఈ సినిమా విడుదల చెయ్యాలని చిత్ర యూనిట్ నిర్ణయించుకున్నారు.